మాస్టర్ భరత్ ఎక్కడా..? ఏం చేస్తున్నాడు, ఇండస్ట్రీలో కనిపించని బాల కమెడియన్..

By Mahesh Jujjuri  |  First Published Jan 29, 2024, 11:06 AM IST

మాస్టర్ భరత్ గుర్తున్నాడా.. చిన్న వయస్సులోనే పెద్ద పెద్ద సినిమాలతో కడుపుబ్బా నవ్వించిన ఈ స్టార్ కమెడియన్ ఇప్పుడేమైపోయాడు..? ఇండస్ట్రీలో కనిపించని బాల కమెడియన్.. 
 



మాస్టర్ భరత్ అసలు అసలు పరిచయం చేయాల్సిన  అవసర లేని కమెడియన్.. చిన్న వయస్సులోనే ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించిన ఘనుడు.. ఎన్నో సినిమాల్లో తన టాలెంట్ తో..పెద్ద పెద్ద కమెడియన్స్ కే పోటీ వచ్చిన చిచ్చరపిడుగు భరత్. మాస్టర్ భరత్ ఈసినిమాల ఉన్నాడంటే.. స్టార్ కమెడియన్లు ఎంతమంది ఉన్నా.. మనోడి సీన్ల కోసమే ఎదురు చూసేవారు.. భరత్ ఎక్స్ ప్రెషన్స్.. బాడీలాంగ్వేజ్.. డైలాగ్ డెలివరీకీ.. పడి పడీ నవ్వుకునేవారు ఆడియన్స్.. రెడీ, వెంకీ, సీమశాస్త్రీ ఇలా చెప్పుకుంటూ వెళ్తే.. భరత్ ఖాతాలో ఎన్నో సూపర్ హిట్ సినిమాలు.. ఆణిముత్యాలే ఉంటాయి.అయితే తరువాత కాలంలో భరత్ పెద్దవాడు కావడంతో అవకాశాలు తగ్గుతూ వచ్చాయి. 

కమెడియన్ గా అవకాశాలు తగ్గడంతో సిల్వర్ స్క్రీన్ కు కాస్త గ్యాప్ ఇచ్చాడు భరత్. ఆతరువాత కసరత్తులు చేసి.. స్లిమ్ గా తయారయ్యి.. టీనేజ్ కుర్రాడిగా మళ్లీ ఎంట్రీ ఇచ్చాడు.. బాగా బొద్దగా ఉండే భరత్.. ఆతరువాత హ్యాండ్సమ్ గా హీరోలా మారిపోయాడు. స్లీమ్ గా మారిన తరవాత కూడా చాలా అవకాశాలు అందుకున్నాడు భరత్. దూసుకెళ్తా, ఆచారి అమెరికా యాత్ర, ఇద్దరి లోకం ఒక్కటే, ఫైనల్ గా అల్లు శిరీష్ ఫ్రెండ్ గా ఏబిసిడి  సినిమాలో కూడా నటించి మెప్పించాడు భరత్. 

Latest Videos

 

కాని ఆతరువా వెండితెరపూ కనిపించలేదు కుర్ర కమెడియన్. హీరోలకు సపోర్టింగ్ రోల్స్ చేస్తూ.. కామెడీత్ పాటు..క్యారెక్టర్ ఆర్టిస్ట్ ముద్ర వేయించుకున్నాడు.ఇక సోలోహీరోగా ఎంట్రీ ఇవ్వాలని పట్టదలతో ప్రయత్నించాడు. కాని అవకాశాలు రాలేదో..ఏక తానే ఇకవద్దు అనుకున్నాడో తెలియదు కాని.. ఇండస్ట్రీలో కనిపించడం లేదు భరత్. తెలుగు, తమిళంలో వరుస సినిమాలు చేసిన ఈ కుర్ర కమెడియన్.. అరవంలో కూడా కనిపించడం లేదు. దాంతో మాస్టర్ భరత్ ఫ్యాన్స్ మనోడు ఎక్కడా అని వెతుక్కుంటున్నాడు. 

ఇక స్లిమ్ అవ్వాలన్న పట్టుదలతో.. ఓవర్ గా జిమ్ చేసి తన కుడికంటికి గాయం చేసుకున్నాడు భరత్. చాలా కాలం కుడి కన్ను కనిపించలేదని ట్రీట్మెంట్ తరువాత చూడగలిగానన్ని ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు. హీరో అవ్వాలని పట్టుదలతోఉన్న భరత్ అంత తేలిగ్గా ఇండస్ట్రీని వదిలి వెళ్ళడని అంటున్నారు ఫ్యాన్స్. ప్రస్తుతం స్టడీస్ కంప్లీట్ చేసి.. ఇంకాస్త స్లిమ్ గా.. హ్యండ్సమ్ గా తయారయ్యి.. మళ్ళీ ఇండస్ట్రీలోకి అడుగు పెడతాడంటున్నారు. మరి భరత్ నిజంగా మళ్లీ రీ ఎంట్రీ ఇస్తాడా..? ప్రస్తుతం 29 ఏళ్ళ కుర్ర నటుడు హీరోగా సెటిల్ అవుతాడా..? లేక ఇండస్ట్రీని వదిలేస్తాడా చూడాలి...?  
 

click me!