69వ ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ వేడుక గ్రాండ్ గా జరిగింది. ఈవెంట్ లో బాలీవుడ్ స్టార్ రణబీర్ కపూర్ Ranbir Kapoor తో పాటు మరో నటుడు ఉత్తమ నటుడిగా అవార్డులను అందుకున్నారు.
Filmfare Awards 2024.. 69వ ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్ అహ్మదాబాద్‌లో నిన్న జరిగాయి. గతేడాది సెన్సేషన్ క్రియేట్ చేసిన చిత్రాలు, నటుల పెర్ఫామెన్స్ కు గానూ అవార్డులను ప్రదానం చేశారు. బాలీవుడ్ నటుడు రణబీర్ కపూర్ Ranbir Kapoor ‘యానిమల్’ Animal The Film చిత్రంతో గతేడాది చివర్లో దుమ్ములేపారు. దీంతో ఈవెంట్ లో సత్తా చాటారు. ఆ మూవీలో చాక్లెట్ బాయ్ రణ్బీర్ ను దర్శకుడు సందీప్ రెడ్డి వంగా Sandeep Reddy Vanga రగ్డ్ లుక్ తో వాయిలెన్స్ పర్సనాలిటీగా చూపించారు. యాక్షన్ సీన్లలో అదరగొట్టారు.
రన్బీర్ కపూర్ పెర్ఫామెన్స్ కు ఫ్యాన్స్, ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్సే దక్కింది. అలాగే బాక్సాఫీస్ వద్ద కూడా ఈ చిత్రం కాసుల వర్షం కురిపించింది. ఇదిలా ఉంటే... తాజాగా గుజరాత్ లోని అహ్మదాబాద్ లో నిర్వహించిన 69వ ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ 2024లో రన్బీర్ ఉత్తమ నటుడిగా మేల్ విభాగంలో Best Actorగా అవార్డును సొంతం చేసుకున్నారు. దీంతో ఆయన అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఈ సందర్భంగా గతంలో తను గెలుచుకున్న అవార్డులను గుర్తు చేసుకుంటున్నారు.
ఇక రన్బీర్ గతంతో ‘సావరియా’తో బెస్ట్ డెబ్యూ యాక్టర్ గా, ‘వేకప్ సిద్, రాకెట్ సింగ్ కు క్రిటిక్స్ నుంచి బెస్ట్ యాక్టర్ గా అవార్డును సొంతం చేసుకున్నారు. అలాగే రాక్ స్టార్, బర్ఫీ, సంజు, ఇప్పుడు యానిమల్ సినిమాకు గానూ అవార్డును సొంతం చేసుకున్నారు. రన్బీర్ తో పాటు 12th Fail మూవీ హీరో విక్రాంత్ మాస్సే Vikrant Massey ఉత్తమ నటుడిగా (క్రిటిక్స్) ఫిల్మ్‌ఫేర్ అవార్డును గెలుచుకున్నాడు. ఈ చిత్రం దేశవ్యాప్తంగా ప్రేక్షకుల ఆదరణ పొంది. ఐపీఎస్ అధికారి మనోజ్ జీవితం ఆధారంగా తెరకెక్కించిన సినిమా ఇది. విక్రాంత్ నటనకు ప్రశంసలు అందాయి. ఇక అలియా భట్ Alia Bhatt కూడా ఉత్తమ నటిగా అవార్డును దక్కించుకున్నారు. రణవీర్ సింగ్ నటించిన ‘రాకీ ఔర్ రాణి కి ప్రేమ్ కహానీ’ చిత్రానికి గానూ అవార్డును సొంతం చేసుకున్నారు అలియా.