టాలీవుడ్ స్టార్ సింగర్ రేవంత్ ఓ ఇంటివాడయ్యాడు. గుంటూరుకు చెందిన యువతితో ఆయన వివాహం ఘనంగా జరిగింది. రేవంత్ అభిమానులు ఆయనకు బెస్ట్ విషెష్ తెలియజేస్తున్నారు.
టాలీవుడ్ సింగర్ రేవంత్ పెళ్లిపీటలు ఎక్కాడు. ఫిబ్రవరి 6 ఆదివారం ఆయన వివాహం జరిగింది. అమ్మాయి గుంటూరుకి చెందిన అన్విత అని సమాచారం.పెద్దలు కుదిర్చిన రేవంత్ పెళ్లి వేడుక గుంటూరులోని ఓ ఫంక్షన్ హాలులో ఘనంగా నిర్వహించారు. కరోనా పరిస్థితుల దృష్ట్యా కుటుంబ సభ్యులు, సన్నిహితులు, శ్రేయోభిలాషులు పరిమిత సంఖ్యలో పెళ్లి వేడుకకి హాజరయ్యారు. అలాగే రేవంత్ సాన్నిహిత్యం ఉన్న పలువురు టాలీవుడ్ సింగెర్స్ కూడా హాజరై వధూవరులను ఆశీర్వదించారు. రేవంత్ - అన్విత పెళ్లి ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
గత ఏడాది డిసెంబర్ 24న నిశ్చితార్ధం జరిగింది. సప్త స్వరాలు అనే సంగీత కార్యక్రమం ద్వారా రేవంత్ గాయకుడిగా తన ప్రయాణాన్ని ప్రారంభించారు. పలు షోస్‌లో ఆయన పాల్గొన్నారు. అలాగే తెలుగు సినిమాల్లో ప్లే బ్యాక్ సింగర్‌గానూ తనదైన గుర్తింపును సంపాదించుకున్నారు. జై చిరంజీవి, బాహుబలి, దమ్ము, జై చిరంజీవ, అర్జున్ రెడ్డి, ఆచార్య వంటి పలు చిత్రాల్లో రేవంత్ పాటలు పాడి తనదైన గుర్తింపును సంపాదించుకున్నారు.
undefined
రేవంత్ ఇండియన్ ఐడల్ సీజన్ 9 టైటిల్ గెలుపొందారు. గతంలో సింగర్ శ్రీరామ చంద్ర ఇండియన్ ఐడల్ టైటిల్ అందుకున్నారు. ఆ తర్వాత రేవంత్ ఐడియన్ ఐడల్ టైటిల్ గెలుపొందారు. ఇక రేవంత్ పెళ్లి వార్త తెలుసుకున్న అభిమానులు సోషల్ మీడియా వేదికగా బెస్ట్ విషెష్ తెలియజేస్తున్నారు.