Jayasudha : కరోనా బారిన పడ్డ నటి ‘జయసుధ’.. త్వరగా కోలుకోవాలని అభిమానుల ప్రార్థనలు..

Published : Feb 07, 2022, 04:25 PM IST
Jayasudha : కరోనా బారిన పడ్డ  నటి ‘జయసుధ’.. త్వరగా కోలుకోవాలని అభిమానుల ప్రార్థనలు..

సారాంశం

కరోనా మహమ్మారి సినీ ఇండస్ట్రీని వెంటాడుతూనే ఉంది. ఇఫ్పటికే చాలా మంది స్టార్స్ కరోనా బారిన పడ్డ విషయం తెలిసిందే. తాజాగా టాలీవుడ్ సీనియర్ నటి జయసుధ కరోనాకు గురైయ్యారు. ప్రస్తుతం హోం ఐసోలేషన్ లో ఉన్నారు.   

టాలీవుడ్ లో ఇప్పటికే పలువురు స్టార్స్‌ కరోనా బారినపడి నానా అవస్థలు పడ్డారు. ఎట్టకేళలకు అందరూ కోలుకుంటూ వచ్చారు. అయితే కరోనా కొత్త వేరియంట్ ప్రభావం సినీ ఇండస్ట్రీ గట్టిగానే ఉంది. వారం కింద మెగా స్టార్ చిరంజీవి కరోనా బారిన పడి కోలుకున్నారు. కాగా తాజాగా సహజనటి జయసుధ కూడా కరోనా బారిన పడ్డారు. ప్రస్తుతం ఆమె హోం ఐసోలేషన్‌లో చికిత్స తీసుకుంటున్నారు. ఇక జయసుధకి కరోనా అని తెలియగానే ఆమె త్వరగా కోలుకోవాలని అభిమానులు ప్రార్థిస్తున్నారు. ఈ మేరకు సోషల్ మీడియాలో తన హెల్త్ త్వరగా రికవరీ కావాలని కోరుకుంటున్నారు.  

సీనియర్‌ నటి జయసుధ ఇటీవల కొత్త లుక్‌లో కనిపించి అభిమానులను ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ఆమె లేటెస్ట్ ఫోటో ఒకటి సోషల్‌ మీడియాలోనూ  వైరల్‌ గా మారింది.  జయసుధ కూడా స్లిమ్‌గానూ మారిపోయారు. గతంలో ఓ సందర్భంగా నడిసిన(తెల్లని) జుట్టుతో కనిపించి షాక్‌కి గురి చేసిన జయసుధ   కొత్త లుక్‌లో దర్శనమివ్వడంతో అభిమానులు ఆనందం వ్యక్తం చేశారు. 62ఏళ్ల జయసుధ బరువు తగ్గడంతో యంగ్‌గా కనిపించారు. కానీ ప్రస్తుతం కరోనాకు గురవడంతో అభిమానులు ఆందోళన చెందుతున్నారు. 

జయసుధ ఇటీవల కాలంలో `శతమానం భవతి`, `శ్రీనివాస కళ్యాణం`,`మహర్షి` చిత్రాల్లో కనిపించింది. చివరగా ఆమె రెండేళ్ల క్రితం వచ్చిన `రూలర్‌` చిత్రంలో నటించారు. యంగ్‌ హీరోలకు జయసుధ బెస్ట్ ఆప్షన్‌ అవుతున్నారు. అయితే మధ్యలో కాస్త గ్యాప్‌ తీసుకున్న ఆమె మళ్లీ కమ్‌ బ్యాక్‌ కాబోతుందని సమాచారం. కానీ కరోనా బారిన పడటంతో ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు. ఆమె త్వరగా కోలుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు. ఇటీవల బాలీవుడ్ గాయని లతా మంగేష్కర్ కరోనాతో 29 రోజులు ఐసీయూలోనే పోరాడి మరణించిన విషయం తెలిసిందే.  

PREV
click me!

Recommended Stories

చిరంజీవి, అనిల్ రావిపూడి రెమ్యునరేషన్స్ కే బడ్జెట్ మొత్తం అయిపోయిందా ? ఇక సినిమా పరిస్థితి ఏంటి ?
Illu Illalu Pillalu Today Episode Dec 17: వల్లిని గట్టిగా నిలదీసిన రామరాజు, దొంగ సర్టిఫికెట్లతో భాగ్యం