టాలీవుడ్ లో మరో తీవ్ర విషాదం, ప్రముఖ నటుడు, నిర్మాత వల్లభనేని జనార్థన్ కన్నుమూత

By Mahesh JujjuriFirst Published Dec 29, 2022, 12:05 PM IST
Highlights

టాలీవుడ్ ప్రముఖ నటుడు, దర్శకుడు, నిర్మాత వల్లభనేని జనార్దన్ కన్నుమూశారు. ఈమధ్య కాలంలో అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన పరిస్థితి విషమించడంతో ప్రైవేట్ హాస్పిటల్ లో ట్రీట్మెంట్ తీసుకుంటూ..కన్నుమూశారు. 
 

టాలీవుడ్ ను వరుస విషాదాలు వెంటాడుతున్నాయి. నాలుగైదు నెలల వ్యావదిలోనే దిగ్గజ నటులను కోల్పోయింది ఫిల్మ్ ఇండస్ట్రీ. రెబల్ స్టార్ కృష్ణంరాజు, సూపర్ స్టార్ కృష్ణ, నవరస నటనా సార్వభౌమ కైకాల సత్యనారాయణ,  చలపతి రావు ఇలా వరుస మరణాలు టాలీవుడ్ లో విషాదాన్ని నింపాయి. ఈక్రమంలోనే మరో సీనియర్ నటులు, నిర్మాత, దర్శకులు వల్లభనేని జనార్దన్ మరణించారు. ఇటీవల అనారోగ్య సమస్యతో అపోలో చేరిన ఆయన చికిత్స పొందుతూ ఈ రోజు ఉదయం 10.20 నిమిషాలకు  కన్నుమూశారు. 

నటుడిగా.. దర్శకుడిగా..నిర్మాతగా వల్లభనేని జనార్దన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో మల్టీ టాలెంట్ చూపించారు.  జనార్ధన్ అంటే చాలా మంది గుర్తు పట్టకపోవచ్చు కాని గ్యాంగ్ లీడర్ లో పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ ను మాత్రం ఆడియన్స్ ఎప్పటికీ మర్చిపోలేరు. సుమలత తండ్రిగా.. విలన్ శేడ్స్ ఉన్న పోలీస్ ఆఫీసర్ గా ఆయన నటన మర్చిపోలేనిది. చేసింది తక్కువ సినిమాలే అయినా.. తెలుగు ప్రేక్షకులు కలకాలం గుర్తు పెట్టుకునే పాత్రలుచేశారు జానార్ధన్. ఆయన వయసు ప్రస్తుతం 63 సంవత్సరాలు. ప్రముఖ దర్శన నిర్మాత విజయబాపినీడు మూడవ కూతురు లళినీ చౌదరిని జనార్ధన్ పెళ్లి చేసుకున్నారు. ఆయనకు ఇద్దరు కూతుర్లు, ఓ కొడుకు ఉన్నారు. మొదటి అమ్మాయి శ్వేత. చిన్నతనంలోనే మరణించగా.. రెండో కూతురు అభినయ ఫ్యాషన్ డిజైనర్.. ఇక అబ్బాయి అవినాశ్ అమెరిగాలో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా పనిచేస్తున్నారు. జనార్ధన్ మృతితో ఇండస్ట్రీలో విషాదచాయలు అలుముకున్నాయి.

కూతురు మరణం తట్టుకోలేకపోయిన జనార్ధన్ ఆమె పేరుమీద  శ్వేత ఇంటర్నేషన్ సంస్థను స్థాపించారు. ఈ బ్యానర్ పై వరుస సినిమాలు నిర్మించారు.  శ్రీమితి కావాలి, పారిపోయిన ఖైదీలు సినిమాలను సొంతంగా  రూపొందించారు. అంతే కాదు తన  మామ విజయబాపినీడుతో కలిసి మహాజనానికి మరదలు పిల్ల చిత్రాన్ని నిర్మించారు. మెగాస్టార్ చిరంజీవితో ఆయన తెరకెక్కించిన గ్యాంగ్ లీడర్ ఎంత సూపర్ హిట్ అయ్యిందో తెలిసిందే. అంతే కాదు ఈ సినిమాలో  సుమలత తండ్రి పాత్రలో వల్లభనేని జనార్ధన్ నటన ఎప్పటికీ మర్చిపోలేదు. . ఓవైపు నటుడిగా కొనసాగుతూనే నిర్మాతగానూ రాణించారు జనార్దన్.  

నిర్మాతగా రాణిస్తూనే.. నటనపై ఆయనకు ఉన్న ప్రేమతో.. ఆ సినిమాలో చిన్న చిన్న పాత్రలను కూడా వేసేవారు జానార్దన్.  చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ వంటి స్టార్ హీరోలతో కలిసి నటించారు జనార్ధన్. అంతే కాదు వెండితెరతో పాటు బుల్లితెరపై కూడా తన మార్క్ చూపించారు జనార్థన్. సుమన్ డైరెక్షన్ లో ఆయన నటించిన  అన్వేషిత సీరియల్ సూపర్ డూపర్ హిట్. ఇప్పటికీ ఆ సీరియల్ గురించి పలు సందర్భాల్లో చర్చ జరుగుతూనే ఉంటుంది. 

ఇక ఆయన పర్సనల్ విషయాల గురించి చూస్తే..  వల్లభనేని జనార్ధన్ 1959 సెప్టెంబర్ 25న ఏలూరు దగ్గర చిన్న గ్రామంలో  జన్మించారు. విజయవాడలోని లయోలా కాలేజీలో చదువు పూర్తిచేసి.. సినిమాపై ఆసక్తితో చిత్రపరిశ్రమలోకి అడుగుపెట్టారు. ఆయనకు మొదటి నుంచి సినిమాలంటే ప్రాణం. అయితే వచ్చి రావడంతోనే..  సొంతంగా నిర్మాణ సంస్థను ఏర్పాటు చేసి మామ్మగారి మనవలు  సినిమాను స్టార్ట్ చేశారు కాని అది కంప్లీట్ కాలేదు.  ఆ తర్వాత కన్నడలో హిట్ అయిన మానససరోవర్ ఆధారంగా చంద్రమోహన్ హీరోగా అమాయక చక్రవర్తి సినిమాకు దర్శకత్వం వహించారు. శోభన్ బాబు హీరోగా తోడు నీడ సినిమాను నిర్మిచారు. ఇలా మల్టీ టాలెంట్ తో తనకంటూ ఓ ప్రత్యేక ఇమేజ్ సాధించిన జనార్థన్ మృతితో టాలీవుడ్ లో విషాద ఛాయలు అలముకున్నాయి. 

click me!