ఎన్టీఆర్ సినిమాకు నో చెప్పి.. కళ్యాణ్ రామ్ సినిమాకు విజయశాంతి గ్రీన్ సిగ్నల్..?

Google News Follow Us

సారాంశం

రీ ఎంట్రీలో ఒకటే ఒక సినిమా చేసింది లేడీ సూపర్ స్టార్ విజయశాంతి. తనకుబాగా నచ్చిన పాత్ర.. అది కూడా తను చేయాలి అనుకుంటేనే సినిమా చేస్తాను కాని.. వచ్చిన ప్రతీ ఆఫర్ తీసుకోను అంటూ తెగేసి చెప్పారు విజయశాంతి. తాజాగా ఆమె మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. 
 

ఎన్ని ఆఫర్లు వచ్చినా నో చెపుతూ వచ్చిన విజయశాంతి.. 2020లో రిలీజ్ అయిన సరిలేరు నీకెవ్వరు సినిమాను మాత్రం ఒకే చేసింది. అది కూడా అనిల్ రావిపూడి పట్టుదలతో ఒప్పించడం. క్యారెక్టర్ లో డెప్త్ ఉండటంఈ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మూవీతో రీ ఎంట్రీ ఇచ్చిన విజయశాంతి ఇక వరుస సినమాలు చేస్తారు అని అంతా అనుకున్నారు. కాని లేడీ సూపర్ స్టార్ మాత్రం ఇకముందు కూడా నచ్చితే సినిమా చేస్తా లేకుంటే  లేదు అని చెప్పేసింది. సరిలేరు నీకెవ్వరు సినిమాలో కూడా..  ఆమె అతి కీలకమైన పాత్ర పోషించింది.  ఆ సినిమా కథ మొత్తం.. ఆమె పాత్ర చుట్టూనే తిరుగుతుంది.

హీరోయిన్  రష్మిక పాత్ర కంటే కూడా విజయశాంతి పాత్రే కీలకమని చెప్పొచ్చు. అంతే కాదు ఈ క్యారెక్టర్ కోసం భారీగా రెమ్యూనరేషన్ కూడా తీసుకుందట రాములమ్మ.  ఇక ఆతరువాత కూడా ఎన్ని ఆఫర్లు వచ్చినా..  తల్లి పాత్రలు అంటే ఈమె చేయను అని మొహమాటం లేకుండా చెప్పేసిందట. అనిల్ రావిపూడి ఈ సినిమాకంటే ముందు ఆమెతో రాజా ది గ్రేట్ సినిమాలో రాధిక చేసిన  తల్లి పాత్రని చేయించాలనివిశ్వ ప్రయత్నం చేశాడట. కాని విజయశాంతి మాత్రంససేమిరా అన్నారని టాక్. 

ఇక సరిలేరు నీకెవ్వరు తరువాత రీసెంట్ గా  విజయశాంతి కి ఎన్టీఆర్ – కొరటాల శివ.. కాంబో మూవీ  దేవర సినిమాలో నటించాలని రిక్వెస్ట్ వెళ్ళిందట. కాని తల్లి పాత్ర చేయను అని మాటమీద నిలబడ్డ విజయశాంతి.. ఈసినిమాను కూడా రిజెక్ట్ చేయడంతో.. ఇక ఆమె నటించదు అని అంతా అనుకున్నారు. కాని తాజా సమాచారం ప్రకారం విజయశాంతి  మళ్ళీ మేకప్ వేసుకోవడానికి రెడీ అవ్వడం విశేషం అవును.. తమ్ముడు ఎన్టీఆర్ సినిమాను రిజెక్ట్ చేసిన విజయశాంతి... అన్న  కళ్యాణ్ రామ్ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 

కల్యాన్ రామ్ హీరోగా  హీరోగా అశోక క్రియేషన్స్‌, ఎన్టీఆర్‌ ఆర్ట్స్‌ బ్యానర్ల పై ముప్పా వెంకయ్య చౌదరి సమర్పణలో అశోక్ వర్ధన్ ముప్పా, సునీల్ బలుసు ఓ భారీ బడ్జెట్ చిత్రాన్ని నిర్మించడానికి రెడీ అయ్యారు. ప్రదీప్ చిలుకూరి ఈ ప్రాజెక్టుకి దర్శకుడు. ఈరోజు పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైంది ఈ మూవీ.కళ్యాణ్ రామ్ 21వ సినిమాగా రూపొందుతున్న ఈ మూవీలో విజయశాంతి నటిస్తోంది. 

 

ఈ సినిమాలో విజ‌య‌శాంతి కీల‌క పాత్రను పోషిస్తుండ‌డం విశేషం. హైదరాబాద్‌లో జరిగిన ఈ సినిమా ప్రారంభోత్సవ వేడుక‌లో చిత్ర ప‌రిశ్రమ‌కు చెందిన ప‌లువురు ప్రముఖులు హాజ‌ర‌య్యారు. ముహూర్తపు స‌న్నివేశానికి విజ‌య‌శాంతి క్లాప్ కొట్టగా.. ముర‌ళీ మోహ‌న్ కెమెరా స్విచ్ ఆన్ చేశారు. ముప్పా వెంక‌య్య చౌద‌రి స్క్రిప్ట్ అందించారు. ఇక ఈమూవీలో కూడా విజయశాంతిది కీలక పాత్ర అని తెలుస్తోంది. కథ అంతా ఆమె క్యారెక్టర్ మీదనే ఆధారపడి ఉంటందని సమాచారం.