చీటింగ్ కేసులో ప్రముఖ టాలీవుడ్ నిర్మాత అరెస్ట్, భారీగా వసూళ్లు చేసిన బడా ప్రొడ్యూసర్..?

By Mahesh JujjuriFirst Published Dec 2, 2023, 12:09 PM IST
Highlights

ప్రముఖ టాలీవుడ్ నిర్మాత అట్లూరి నారాయణ రావును పోలీసలు అరెస్ట్ చేశారు చీటింగ్ కేసులో ఈ భడా నిర్మాత అరెస్ట్ అయ్యారు. ఇకవివరాల్లోకి వెళితే..? 

ఈమధ్య సినీ నిర్మాతలు కొంతమంది చిటింట్ కేసుల్లో ఇరక్కోవడం కామన్ అయ్యింది. తమిళనాట ఓ ప్రోడ్యూసర్ అలానే అరెస్ట్ అయ్యాు. తాజాగా టాలీవుడ్ భడా నిర్మాతకు కూడా ఈపరిస్థితి తప్పలేదు. అధిక వడ్డీ ఆశ చూపించి వందలాది మందిని మోసం చేసిన కేసులో ప్రముఖ నిర్మాతని పోలీసులు అరెస్ట్ చేశారు. నీదీ నాది ఒకే కథ, గర్ల్ ఫ్రెండు లాంటి  సినిమాలను నిర్మించిన  అట్లూరి నారాయణరావు‌ని ఫాస్ట్ మూవింగ్ కన్జూమర్ గూడ్స్ దందా కేసులో పోలీసులు అరెస్టు చేశారు. 

Allu Arjun: అల్లు అర్జున్ కు అనారోగ్యం, పుష్ప2 షూటింగ్ కు బ్రేక్..? అభిమానుల్లొ ఆందోళన

ఇక నిన్న (01 డిసెంబర్ ) శుక్రవారం ఆంధ్రప్రదేశ్ లో ఆయనను సీసీఎస్ పోలీసులు అదుపులోకి తీసుకొని అరెస్ట్ చేసి, హైదరాబాద్ నాంపల్లి కోర్టులు హాజరు పరిచారు. నారాయణరావుపై గతంలో కూడా చాలా కేసులు ఉన్నట్టు తెలుస్తోంది.  చాక్లెట్ డిస్ట్రిబ్యూషన్, డీలర్ షిప్ పేరతో దాదాపు వందల మందిని మోసం చేసి 530 కోట్లు వసూళ్లు చేశారని ఆయనపై  గతంలోనే ఆభియోగాలు ఉన్నాయి. ఈకేసులో సూత్రధారులుగా ఉన్న మరికొంత మందిని  ఆంధ్రాలో గత నెలలోనే పోలీసులు అరెస్ట్ చేశారు.

తక్కవ సమయంలో పెట్టిన పెట్టుబడికి ఎక్కువ వడ్డీ వస్తుందని ఆశ చూపించి ఇండస్ట్రీకి చెందినవారిని, పలు వ్యాపారులను మోసం చేసి కోట్లు వసూళ్లు చేసి తర్వాత బోర్డు తిప్పేయడంతో బాధితులు తీవ్ర మనస్థాపానికి గురై కేసు పెట్టారు. బాధితులు రాంబాబు ని ఒత్తిడి చేయగా.. ఓ చార్టెట్ అకౌంట్ ద్వారా నిర్మాత నారాయణరావును కలవగా, కేసు లేకుండా చేస్తాను.. అందుకోసం ఖర్చు అవుతుందని చెప్పి రూ.20 కోట్లు డిమాండ్ చేశాడు. బేరసారాలు చేసి డీల్ రూ.2 కోట్లకు కుదుర్చుకొని పది లక్షలు అడ్వాన్స్, కోటి విలువైన గోల్డ్ ఆభరణాలు తీసుకున్నాడు. 

విజయ్ దేవరకొండ- రష్మిక, ప్రభాస్-అనుష్క, చైతూ‌- శోభిత, సిద్దార్ధ్-అతిధి వీళ్లు ప్రేమలో ఉన్నారా..?

ఇక తీసుకున్న నగలను  పాతబస్తీలో కరిగించి 90 లక్షలకు అమ్మేశాడు. ఈ క్రమంలోనే ఆయనను ఏపీలో అరెస్ట్ చేశారు. కాగా, నారాయణరావును అదనపు విచారణ కోసం పోలీసు కస్టడీకి అప్పగించాల్సిందిగా నాంపల్లి కోర్టుకు పోలీసులు పిటీషన్ దాఖలు చేసినట్లు వార్తలు వస్తున్నాయి. ఇక ఈ కేసుల్లో నిజా నిజాలు తేలితే శిక్ష భారిగా ఉంటుందంటున్నారు. 

click me!