టాలీవుడ్‌లో ముగిసిన కార్మికుల సమ్మె.. జీతాల పెంపుకు నిర్మాతలు ఓకే, రేపటి నుంచి షూటింగ్‌లు

By Siva KodatiFirst Published Jun 23, 2022, 3:06 PM IST
Highlights

టాలీవుడ్‌లో సినీ కార్మికుల సమ్మెకు తెరపడింది. పెంచిన జీతాలు రేపటి నుంచే అమలు చేస్తామని ఫెడరేషన్ పేర్కొంది.  విధి విధానాలపై చర్చలు జరుగుతాయని ఫెడరేషన్ పెద్దలు తెలిపారు. జీతం ఎంత పెంచాలన్న దానిపై రేపు చర్చించి నిర్ణయిస్తామని నిర్మాతల మండలి వెల్లడించింది. 

టాలీవుడ్‌లో సినీ కార్మికుల సమ్మెకు తెరపడింది. రేపటి నుంచి యథావిధిగా షూటింగ్‌లు జరుగుతాయని ఫిల్మ్ ఫెడరేషన్ ప్రకటించినట్లుగా ప్రముఖ తెలుగు వార్తా సంస్థ ఎన్టీవీ కథనాన్ని ప్రసారం చేసింది. పెంచిన జీతాలు రేపటి నుంచే అమలు చేస్తామని ఫెడరేషన్ పేర్కొంది.  విధి విధానాలపై చర్చలు జరుగుతాయని ఫెడరేషన్ పెద్దలు తెలిపారు. జీతం ఎంత పెంచాలన్న దానిపై రేపు చర్చించి నిర్ణయిస్తామని నిర్మాతల మండలి వెల్లడించింది. పెంచిన జీతాలు చెల్లించే బాధ్యత ఫెడరేషన్, ఫిలిం ఛాంబర్లదేనని నిర్మాతలు తెలిపారు. 

అంతకుముందు నిర్మాతల మండలి, ఫిలిం ఫెడరేషన్‌ నాయకులు వేర్వేరుగా మంత్రి తలసానిని కలిశారు. ఈ క్రమంలోనే పంతాలు, పట్టింపులు వద్దని ఇరుపక్షాలకు చెప్పినట్టుగా మంత్రి తలసాని పేర్కొన్నారు. కరోనా పరిస్థితులతో కార్మికుల వేతనాలు పెరగలేదని చెప్పారు. మధ్యాహ్నం చర్చలు జరిపి సమస్యను పరిష్కరించుకోవాలని సూచించామని తెలిపారు. 

ఇరు వర్గాలు షూటింగ్స్ పైన రెండు రకాలుగా మాట్లాడుతున్నారన్నారు. సామరస్యంగా సమస్య పరిష్కారం చేసుకోవాలన్నారు. రెండు వర్గాలకు న్యాయం జరగాలంటే.. ఇరు వర్గాలు కూర్చొని మాట్లాడుకోవాలని సూచించారు. మంత్రి తలసాని సూచనలతో ఫిలిం ఫెడరేషన్ నాయకులతో నిర్మాతలు చర్చలు జరపుతున్నారు. సినీ కార్మికుల వేతనాల పెంపుకు సంబంధించి ప్రధానంగా చర్చ సాగుతుంది. మరి సినీ కార్మికుల వేతనాల పెంపుపై నిర్మాతలు ఏ విధంగా స్పందిస్తారనేది ఆసక్తిగా మారింది. 

ఇక, నాలుగేళ్ళుగా పెంచాల్సిన వేతనాలు పెంచడం లేదని, దాని వల్ల ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, ఇంటి అద్దెలు, నిత్యావసర వస్తువుల ధరలు బాగా పెరిగిపోయాయని, పిల్లల స్కూల్ ఫీజులు కట్టడం తలకు మించిన భారమైపోతోందని సినీ కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ వేతనాలు పెంచుతూ నిర్ణయం తీసుకునేవరకు ఆందోళన కొనసాగిస్తామని వారు తెలిపారు. 

click me!