సమ్మెకే సై అన్న తెలుగు ఫిలిం ఫెడరేషన్, రేపటి నుంచి టాలీవుడ్‌లో షూటింగ్‌లు బంద్

By Siva KodatiFirst Published Jun 21, 2022, 5:42 PM IST
Highlights

రేపటి నుంచి అన్ని షూటింగ్‌లు బంద్ చేస్తున్నట్లు తెలుగు ఫిల్మ్ ఫెడరేషన్ ప్రకటించింది. వేతన సవరణ జరిగే వరకు షూటింగ్‌లు వుండవని తెలిపింది. మొత్తం 24 క్రాఫ్ట్స్ సమ్మెలో పాల్గొననున్నాయి

వేతన సవరణలు కోరుతూ తెలుగు చిత్ర పరిశ్రమలోని 24 యూనియన్లు సమ్మెకు సిద్ధమైన సంగతి తెలిసిందే. అయితే కార్మిక సంఘాలను బుజ్జగించేందుకు పెద్దలు రంగంలోకి దిగారు. కానీ ఈ చర్చలు విఫలం కావడంతో సమ్మెకే సిద్ధమయ్యారు కార్మికులు. దీనిలో భాగంగా రేపటి నుంచి అన్ని షూటింగ్‌లు బంద్ చేస్తున్నట్లు తెలుగు ఫిల్మ్ ఫెడరేషన్ ప్రకటించింది. వేతన సవరణ జరిగే వరకు షూటింగ్‌లు వుండవని తెలిపింది. మొత్తం 24 క్రాఫ్ట్స్ సమ్మెలో పాల్గొననున్నాయి. 

కాగా.. గడిచిన రెండేళ్లుగా సినీ పరిశ్రమ కోవిడ్ కారణంగా పెద్ద సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ఇప్పుడిప్పుడే పరిస్దితులు చక్కబడుతుండటంతో ఇండస్ట్రీ కోలుకుంటోంది. మరోవైపు సినిమాల్లో హీరోలకు కోట్లకు కోట్లకు ఇచ్చే నిర్మాతలు .. అందులో పనిచేసే 24 క్రాఫ్ట్ మెంబర్స్‌కు మాత్రం తగిన వేతనాన్ని ఇవ్వడం లేదు. గత కొన్నేళ్లుగా సినీ కార్మికుల వేతనాల్లో ఎలాంటి మార్పులు లేవు. ప్రస్తుతం ఇంటా బయటా అన్నింటా ధరలు ఆకాశాన్ని అంటాయి. కానీ.. దానికి తగ్గట్టు జీతాలు మాత్రం పెరగడం లేదు. దీంతో గత కొన్నేళ్లుగా సినీ కార్మికులు వేతనాలు పెంచమంటూ  నిర్మాతల మండలిపై ఒత్తిడి చేస్తూ వచ్చారు. అటు ఫెడరేషన్ కూడా కార్మికుల వేతనాల  అంశాన్ని సాగదీస్తూ వచ్చింది. దీనిపై భగ్గుమన్న కార్మిక సంఘాలు సమ్మెకు సిద్ధమయ్యాయి.

click me!