కింగ్ నాగార్జునతో జత కట్టబోతోంది సీనియర్ హీరోయిన్ ప్రియమణి. చాలాకాలం తరువాత వీరి కాంబోలో సినిమా రాబోతోంది. ప్రస్తుతం ఈ వార్త వైరల్ అవుతోంది.
ఈమధ్య సీనియర్ హీరోలకు హీరోయిన్ల కొరత బాగా ఎక్కువయ్యింది. నయనతార, త్రిషలాంటి కొంత మంది హీరోయిన్లు తప్పించి పెద్దగా ఇండస్ట్రీలో యాక్టీవ్ గా లేరు ఎవరు. దాంతో చిరంజీవి,బాలయ్య, నాగార్జున లాంటి సీనియర్ హీరోలకు హీరోయిన్లు కొరత తప్పడంలేదు. దాంతో ఉన్నవాళ్లలోసీనియర్లను.. గతంలో తమతో చేసిన తారలు వెతుక్కుని మరీ.. తమ సినిమాలకు సెలక్ట్ చేస్తున్నారు. తాజాగా కింగ్ నాగార్జున మూవీలో ఈ ఫార్ములా ప్రకారమే ప్రియమణి సెలక్ట్ అయినట్టు తెలుస్తోంది. గతంలో వీరి కాంబోలో ఒక సినిమా వచ్చింది.
రగడ సినిమాలో నాగార్జున, ప్రియమణి జంటగా కనిపించారు. 2010లో విడుదలైన సినిమా ఇది. ఆ తరవాత నాగ్, ప్రియమణి కలిసి నటించలేదు.వీరు సినిమా చేసే సందర్భం కూడా రాలేదు. ఇక ఇప్పుడు ఇన్నాళ్లకు ప్రియమణితో నాగ్ సినిమా చేయబోతున్నట్టు తెలుస్తోంది. దాదాపు 14 ఏళ్ల తరవాత ఈ జోడీని తెరపై చూసే అవకాశంఆడియన్స్ కు దక్కబోతోంది. నాగార్జున హీరోగా సుబ్బు అనే కొత్త దర్శకుడిని పరిచయం చేస్తూ.. తో ఓ సినిమా పట్టాలెక్కబోతోంది.
ఈసినిమాలో నాగార్జునకు జోడీగా ప్రియమణి కనిపించబోతున్నట్టు తెలుస్తోంది. కోర్ట్ రూమ్ డ్రామాగా రూపొందబోతున్న ఈసినిమాలో కింగ్ నాగార్జున లాయర్‌గా కనిపించబోతున్నాడు. ఆయనకు జోడీగా ప్రియమణి ఆపోజిట్ లాయర్ గా చేస్తుందని తెలుస్తోంది. అంతే కాదు ప్రియమణి క్యారెక్టర్ రెగ్యులర్ హీరోయిన్ పాత్రలకు చాలా భిన్నంగా ఉండబోతోందని, ఓ సీరియస్ టచ్‌తో సాగబోతోందని సమాచారం.
డిఫరెంట్ క్యారెక్టర్స్ చేయగలిగిన సత్తా ఉన్న నటి ప్రియమణి. నారప్ప, వీరాట పర్వం, జవాన్ లాంటి సినిమాలమలో ప్రియమణి ఎంతలా మెప్పించిందో అందరికి తెలుసు. అందుకే ఈ సినిమాలో వెటరన్ హీరోయినే ఈ పాత్రకు న్యాయం చేస్తుందన్న ఉద్దేశంతో ప్రియమణిని ఈసినిమా కోసం తీసుకున్నారని సమాచారం. ఓ బలమైన సామాజిక అంశాన్ని ఈ కథలో ప్రస్తావించబోతున్నారని టాలీవుడ్ లో టాక్ నడుస్తోంది.
ఇక రీసెంట్ గా సంక్రాంతి కానుకగా.. `నా సామిరంగ`తో హిట్టు కొట్టిన నాగ్.. అదే ఉత్సాహంలో ఈ సినిమాకీ త్వరలోనే కొబ్బరికాయ కొట్టబోతున్నాడు. మరోవైపు ధనుష్, శేఖర్ కమ్ముల సినిమాలో నటించబోతున్నాడు మన్మధుడు. ఈసినిమాతో మారోసారి డాన్‌గా కనిపించబోతున్నాడు. ఈమూవీ షూటింగ్ ఇప్పటికే కొనసాగుతోంది.