
సీనియర్ హీరోయిన్ పూర్త ఇలా పెళ్ళి చేసుకుని.. ఏమాత్రం గ్యాప్ లేకుండా అలా పిల్లల్నికనేస్తోంది. మొన్నటి వరకూ బేబీ బంప్ ఫోటోషూట్లతో హడావిడి చేసింది బ్యూటీ.. రీసెంట్ గా బేబీ బంప్ తోనే డాన్స్ కూడా చేసింది చిన్నది. ఇక ప్రస్తతుం పండండి మగ బిడ్డకు జన్మనిచ్చింది పూర్ణ. ఈసంతోషాన్ని తన కుటుంబ సభ్యులతో పాటు.. ఫ్యాన్స్ తో కూడా శేర్ చేసుకుంది. సోషల్ మీడియాలో తన బిడ్డతో సహా ఉన్న ఫోటోలను పంచుకుని సంతోషం వ్యక్తం చేసింది బ్యూటీ.
నటి పూర్ణ సోమవారం రాత్రి దుబాయ్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. బెడ్ పై బాబును ఎత్తుకొని హాస్పిటల్ సిబ్బందితో నటి పూర్ణ ఓ ఫోటోని తన ఇన్ స్ట్రాగ్రామ్ లో షేర్ చేసింది. ప్రస్తుతం తల్లీబిడ్డా క్షేమంగా ఉన్నట్టు వైద్యులు తెలిపారు. ఆమె షేర్ చేసిన ఫోటోలో డాక్టర్స్, నర్స్ లు కూడా ఉన్నారు. ఈ సంబరాన్ని ఫ్యామిలీతో కలిసి దుబాయ్ లో ఎంజాయ్ చేస్తోంది పూర్ణ.
లాస్ట్ ఇయర్ అక్టోబర్ లో దుబాయ్ కి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త ఆసీఫ్ అలీని పెళ్లి చేసుకుంది పూర్ణ. ఆ తర్వతా కొద్దిరోజులకే తాను తల్లిని కాబోతున్నట్లు ప్రకటించింది. రీసెంట్ గా ఆమె సీమంతం వేడుకలు కూడా ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రముఖ సినీ తారలు కూడా హాజరయ్యారు. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో చెక్కర్లు కొట్టాయి.ఇక పూర్ణ గర్బవతి అయినప్పటి నుంచి ఎన్నో ఫోటోలతో నెట్టింట్లో హడావిడి చేసింది పూర్ణ.
రీసెంట్ గా రిలీజ్ అయిన నేచరల్ స్టార్ నానీ -కీర్తి సురేష్ మూవీలో కూడా విలన్ భార్యగా నటించింది పూర్ణ. తెలుగు ఇండస్ట్రీలో నటి పూర్ణ గురించి ప్రత్యేక పరిచయం అక్కరలేదు. 2004 లో మాలీవుడ్ లో మంజు పోలోరు పెంకుట్టి సినిమాతో తేరంగేట్రం చేసింది. అయితే మలయాళంలో హీరోయిన్ గా పెద్దగా వర్కౌట్ అవ్వకపోవడంతో.. క్యారెక్టర్ రోల్స్ కూడా చేసింది పూర్ణ. అంతే కాదు. అవి కూడా పెద్దగా రాకపోవడంతో టాలీవుడ్ వైపు వచ్చింది. ఇక్కడ హీరోయిన్ గా నటించాలని గట్టిగానే ప్రయత్నం చేసింది. కాని కొన్నిరోజులకే ఆమో కెరీర్ మసకబారింది. దాంతో.. ఇక్కడ కూడా క్యారెక్టర్ రోల్స్ చేస్తోంది.
శ్రీ మహాలక్ష్మి సినిమాతో తెలుగులోకి అడుగు పెట్టిన ఈ అమ్మడు.. నరేష్ హీరోగా నటించి సీమ టపాయాయ్ సినిమాలో హీరోయిన్ గా మెప్పించిందిత. ఇక ఆతరువాత రవిబాబు దర్శకత్వంలో హర్రర్ మూవీ అవును, అవును 2 సినిమాలతో టాలీవుడ్ఆడియన్స్ కు బాగా దగ్గరయ్యింది. ఇక టాలీవుడ్ లో గ్లామర్ ఉన్న క్యారెక్టర్ రోల్స్ చేస్తూ... డాన్స్ ప్రోగ్రామ్స్ కు జడ్జ్ గా వ్యవహరిస్తోంది. గత ఏడాది దుబాయ్ కి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త ఆసిఫ్ అలీని వివాహం చేసుకుంది. ఈ మద్యనే నటి పూర్ణకు సీమంతం ఫంక్షన్ ఘనంగా నిర్వహించారు. తాజాగా పూర్ణ పండంటి బాబుకి జన్మనిచ్చింది. దీనికి సంబంధించిన ఫోటో తన ఇన్ స్ట్రాలో వైరల్ అవుతున్నాయి.