
సినిమాల్లోకి రావాలని చాలా మందికి ఉంటుంది. కానీ అందుకు దారి కనపడదు. ఎవరిని కలవాలో తెలియదు. ఎవరిని పరిచయం చేసుకుంటే ముందుకు వెళ్తామో తెలియదు. ఇలాంటి పరిస్దితుల్లో హైదారాబాద్ వచ్చి ట్రై చేసుకుందామని అనుకోవాలని చాలా మంది అనుకుంటారు. అయితే ఎక్కడ నుంచి మొదలెట్టాలి. అందుకు దారి తాను చూపిస్తాను అంటున్నారు నాగార్జున. సినిమాల్లోకి రావాలి అనుకుంటున్న వారికీ తానూ అవకాశం కల్పిస్తాను అంటున్నాడు నాగార్జున. ఇందుకోసం మీరు చేయవల్సిన పని ఏంటంటే.. మీ దగ్గర ఉన్న ఆలోచలను క్రింద ఇచ్చిన నెంబర్ కు వాట్సాప్ చేసి అప్లై చేయడమే. ఈ మేరకు ఆయన ఓ వీడియో ని సోషల్ మీడియోలో అప్ లోడ్ చేసారు. ఆ వీడియోలో ఏముంది అంటే...
1944 లో అక్కినేని నాగేశ్వరరావు (Akkineni Nageswara Rao) గుడివాడ రైల్వే స్టేషన్ లో రైలు కోసం ఎదురు చూస్తున్న సమయంలో తన ఎదురుగా వచ్చి ఆగిన ఒక ట్రైన్ అప్పటి దర్శకనిర్మాత గంటశాల బలరామయ్య, ANR ని చూసి.. బాగున్నాడని పిలిచి మరి హీరో అవకాశం ఇచ్చారు. అక్కడ మొదలైన అక్కినేని ప్రయాణం నేడు ఆయన వారసులు కూడా కొనసాగిస్తున్నారు. అయితే తన తండ్రికి వచ్చినట్లు అందరికి అవకాశం ఎదురు రాదని భావించిన నాగార్జున.. ఆ అవకాశాన్ని ఇప్పుడు ఇండస్ట్రీకి వద్దామనుకుంటున్న వారికి కలిపిస్తాను అంటూ ముందుకు వస్తున్నాడు.
‘THE NEXT BIG THING’ అనే కార్యక్రమంతో టాలెంట్ ఉన్న వాళ్ళని తానే ఇండస్ట్రీకి పరిచయం చేస్తాను అంటున్నాడు. ఇందుకోసం మీరు చేయవల్సిన పని ఏంటంటే.. మీ దగ్గర ఉన్న ఆలోచలను 7093500514 వాట్సాప్ చేసి అప్లై చేయడమే. సినిమాల్లోకి రావాలి అనుకుంటున్న వారు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి. అన్నపూర్ణ కాలేజీ అఫ్ ఫిలిం అండ్ మీడియా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది.
ఇక నాగ్ తన నెక్ట్స్ మూవీని ‘ధమాకా’ రైటర్ ప్రసన్న కుమార్ డైరెక్షన్‌లో చేసేందుకు రెడీ అవుతున్నట్లుగా ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. కాగా, ఈ సినిమాకు సంబంధించి రోజుకో వార్త చక్కర్లు కొడుతోంది. తాజాగా ఈ సినిమాలో హీరోయిన్ ఎవరనే విషయంపై ఓ క్లారిటీ వచ్చినట్లుగా తెలుస్తోంది. 2020 మిస్ ఇండియా మానస వారణాసి ఈ సినిమాలో హీరోయిన్‌గా నటించబోతున్నట్లుగా తెలుస్తోంది.