యంగ్ హీరోయిన్ ను పెళ్లాడబోతున్న బెల్లంకొండ సాయి శ్రీనివాస్

By Mahesh Jujjuri  |  First Published Jan 2, 2024, 5:14 PM IST

ఈమధ్య యంగ్ హీరోల పెళ్ళిళ్లు వరుసగా అవుతునోనాయి. లాస్ట్ ఇయర్ ముగ్గరు టాలీవుడ్ యంగ్ స్టార్స్ పెళ్ళి చేసుకుని ఓ ఇంటివారు అయ్యారు. ఇక ఈ ఏడాది మొదటిగా మరో యంగ్ హీరో పెల్ళి చేసుకోబోతున్నాడట. 
 


ఫిల్మ్  ఇండస్ట్రీలో స్టార్ హీరోలు హీరోయిన్లు వరుసగా పెళ్లిళ్లు చేసేసుకుంటున్నారు. లాస్ట్ ఇయర్ ఇండస్ట్రీలో వరుసగా పెళ్లి బాజాలు మోగాయి. ఇక ఈ ఏడాది కూడా యంగ్ హీరోల పెళ్ళిళ్ళు కంటీన్యూ అయ్యేలా ఉన్నాయి. ఈ ఏడాది పెళ్లి సీజన్ ను స్టార్ట్ చేయబోతున్నాడు యంగ్ హీరో బెల్లం కొండ సాయి శ్రీనివాస్.  తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ యంగ్ హీరో.. త్వరలో పెళ్ళి చేసుకోబోతున్నాడట. అంతే కాదు ఓ యంగ్ హీరోయిన్ మెడలో మూడు ముళ్లు వేయబోతున్నాడట. 

టాలీవుడ్ ఇండస్ట్రీలో యంగ్ హీరోగా పాపులారిటీ సంపాదించుకున్న బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కూడా త్వరలోనే పెళ్లి పీటలు లేకపోతున్నాడు అన్న వార్త ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ బ్యాగ్రౌండ్ గురించి అందరికి తెలిసిందే సినిమా ప్యామిలీ నుంచి వచ్చిన ఆయన.. ఎన్ని ప్రయత్నాలు చేసి.. హిట్ ట్రాక్ ఎక్కలేకపోయాడు. సాలిడ్ హిట్ కోసం ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు. స్టార్ హీరోయిన్లు, స్టార్ డైరెక్టర్ల తోసినిమాలు చేసినా.. యావరెజ్ హిట్ల దగ్గరే ఆగిపోయాడు బెల్లంకొండ. 

Latest Videos

 టాలీవుడ్ తో లాభం లేదని బాలీవుడ్ లో కూడా ట్రై చేశాడు బెల్లంకొండ కాని అక్కడ కూడా కలిసి రాలేదు. వినాయక్ డైరెక్షన్ లో తెలుగు చత్రపతిని హిందీలో రీమేక్ చేశారు. కాని అక్కడ ఆమూవీ డిజాస్టర్ అయ్యింది. ఇక అవన్నీ తరువాత మందు పెళ్ళి చేసుకోవాలి అనుకున్నాడో ఏమో.. వెడ్డింగ్ బెల్స్ మెగించి..  లైఫ్ లో సెటిలైపోవడానికి ఫిక్స్ అయ్యాడు బెల్లంకొండ సాయి శ్రీనివాస్ అంటూ ఓ న్యూస్ వైరల్ అవుతుంది.

టాలీవుడ్ యంగ్ హీరోయిన్ ను బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ప్రేమిస్తున్నాడట. ఈ విషయం ఇంట్లో చెప్పి గ్రీన్ సిగ్నల్ కూడా తెచ్చుకున్నాడట సాయి శ్రీనివాస్. తన బర్త్ డే సందర్భంగా ఈ విషయం అనౌన్స్ చేయడానికిరెడీ అవుతున్నట్టు తెలుస్తోంది. జనవరి 3న సాయి శ్రీనివాస్ బర్త్ డేసందర్భంగా ఈ అనౌన్స్ మెంట్ వస్తుందని చూస్తున్నారు.  ప్రస్తుతం ఈ న్యూస్ వైరల్ అవుతుంది. ఫిబ్రవరిలో వీళ్ళ ఎంగేజ్మెంట్ మార్చిలో పెళ్లి జరగబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఈ విషయంలో ఎంత నిజం ఉందో తెలియాల్సి ఉంది. అటు సాయి శ్రీనివాస్ ఈ విషయంలో స్పందిస్తారో లేదో కూడా చూడాలి. 

click me!