గప్ చుప్: హీరోని అతడి భార్య వదిలేసిందా..?

By Udaya DFirst Published Apr 12, 2019, 4:18 PM IST
Highlights

సినిమా ఇండస్ట్రీలో పెద్ద ఫ్యామిలీకి చెందిన ఓ హీరో ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. 

సినిమా ఇండస్ట్రీలో పెద్ద ఫ్యామిలీకి చెందిన ఓ హీరో ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఒకే కులం కాకపోయినా.. పెద్దల్ని ఒప్పించి తమ ప్రేమని గెలుచుకున్నారు. పెళ్లి చేసుకున్న కొన్ని నెలల వరకు ఈ జంట బాగానే ఉన్నారు. కానీ కొద్దిరోజులకే ఇద్దరి మధ్య విభేదాలు రావడంతో ఇంట్లో తరచూ గొడవలు జరిగేవట.

తను చెప్పిన కొన్ని విషయాలను భర్త పెడచెవిన పెట్టడంతో హర్ట్ అయిన ఆమె అతడి నుండి విడిపోవాలని నిర్ణయించుకొని దూరంగా వెళ్లిపోయింది. అయితే విషయం బయటకి రావడంతో తన పరువు ఎక్కడ పోతుందోనని వెంటనే తామిద్దరం కలిసే ఉన్నామని ఎప్పుడో తీసుకున్న ఫోటోలను షేర్ చేసి కవర్ చేసే ప్రయత్నం చేశాడు మన హీరో. 

కానీ నిజానికి వీరిద్దరి కలిసి లేరు. ఈ హీరోని వదిలేసి అతడి భార్య అమెరికా వెళ్లిపోయిందట. తిరిగివచ్చే ఆలోచన కూడా లేదని తెలుస్తోంది. ఈ విషయాన్ని ఎంత గోప్యంగా  ఉంచాలని ప్రయత్నించినా.. బయటకి పొక్కింది. ఏం చేయాలో పాలుపోక ఈ హీరో సోషల్ మీడియా, సమాజం అంటూ తన మైండ్ ని డీవియేట్ చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు.

తను తీస్తున్న సినిమాలు కూడా ఫ్లాప్ అవుతుండడంతో రాజకీయాల్లోకి రావాలని చూస్తున్నాడు. నిజానికి ఈ ఎన్నికల్లో పోటీ చేయాలని అనుకున్నాడు కానీ అతడికి టికెట్ లభించలేదట. కానీ నెటిజన్లను ఓటేయాలని సోషల్ మీడియాలో పోస్ట్ లు మాత్రం పెట్టాడు. 

click me!