
ఫ్యాన్స్, యాంటీ ఫ్యాన్స్ ఇద్దరూ రెండూ వర్గాలుగా విడిపోయి సోషల్ మీడియాలో రచ్చ రచ్చ చేస్తూంటారు. ఇది ప్రతీ హీరో కి సహజమే. అయితే ఒక్కోసారి అవి శృతి మీరుతూంటాయి. అందరనీ ఇబ్బంది పెడుతూంటాయి. అవకాసం దొరికితే చాలు యాంటి ఫ్యాన్స్ రెచ్చిపోతూంటారు. అలాంటి సంఘటనే రీసెంట్ గా సోషల్ మీడియా, వెబ్ మీడియాలో చోటు చేసుకుంది. రామ్ చరణ్ ని ఈ క్రమంలో టార్గెట్ చేస్తున్నారు. అసలేం జరుగుతోందో చూద్దాం
రీసెంట్ గా తమిళ దర్శకులు డైరక్ట్ చేసిన సినిమాలు డిజాస్టర్ అవతూండటంతో .. ఎవరెవరు తమిళ డైరక్టర్స్ తో చేసి, ఫ్లాఫ్ కొట్టారనే విషయాలు మీడియాలు తవ్వి తీస్తున్నారు. అవేమిటంటే..తమిళ దర్శకులతో నాని నటించిన మూడు సినిమాలన్నీ డిజాస్టర్లుగా నిలిచాయి. అంజనా అలీఖాన్‌తో సెగ, గౌతమ్ మీనన్‌తో ఏటో వెళ్లిపోయింది మనసు, సముద్రఖనితో జెండాపై కపిరాజు ఇలా అన్నీ ప్లాఫ్ లుగా నిలిచాయి. మళ్లీ ఆ తర్వాత నాని కూడా తమిళ దర్శకుడు తో సినిమా చేయలేదు.
ఇక నాగ చైతన్య గౌతమ్ మీనన్‌తో కలిసి ఏ మాయ చేసావే మరియు సాహసం శ్వాసగా సాగిపో అనే రెండు చిత్రాలకు పనిచేశాడు, ఇందులో YMC సూపర్ విజయవంతమైంది.. మరొకటి పరాజయం పాలైంది. తాజాగా విక్రమ్ ప్రభు దర్శకత్వంలో వచ్చిన కస్టడీ కూడా డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది. అలాగే తమిళ దర్శకులతో మహేష్ బాబు రెండు పెద్ద సినిమాలు చేశారు. ఒకటి ఎస్‌జె సూర్యతో నాని, మరొకటి ఎఆర్ మురుగదాస్‌తో స్పైడర్. అదే దర్శకుడు చిరంజీవి స్టాలిన్‌తో హిట్ కొట్టాడు. కానీ మహేష్ బాబు తో రెండు సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్ గా మిగిలాయి. అలాగే రామ్ , లింగుస్వామి కాంబినేషన్ లో వచ్చిన వారియర్ చిత్రం సైతం డిజాస్టర్ అయ్యింది. కష్టడీ, వారియర్ నిర్మాత ఒకరే కావటం విశేషం.
ఈ నేపధ్యంలో పవన్ కళ్యాణ్ ఇప్పుడు తమిళ దర్శకుడు సముద్రఖని ఇసుకతంలో PKSDT చేస్తున్నారనే విషయం గుర్తు చేస్తున్నారు. అలాగే రామ్ చరణ్ ప్రముఖ తమిళ దర్శకుడు శంకర్ దర్శకత్వంలో చేస్తున్న పొలిటికల్ యాక్షన్ డ్రామా గేమ్ చేంజర్ సినిమాని గుర్తు చేస్తున్నారు. ఈ సినిమాలు తమిళ దర్శకులే కదా ...టార్గెట్ చేస్తున్నారు. ఇప్పటి నుంచే ప్లాఫ్ అంటూ ప్రచారం మొదెలెట్టేస్తున్నారు. అయితే ఇది మంచి ట్రెండ్ కాదు. ఏ సినిమా హిట్ అవుతుందో..ప్లాఫ్ అవుతుందో రిలీజ్ దాకా ఎవరూ చెప్పలేరు. కోట్లు ఖర్చు పెట్టి తీసే సినిమా ఫ్లాఫ్ అయితే చాలా మంది నష్టపోతారు. కాబట్టి ఇలాంటి ప్రచారాలు యాంటి ఫ్యాన్స్ చేయకుండా ఉంటే బాగుంటుంది.