స్పైసీ నెస్ కోసం గుంటూరుపై మహేష్ ప్రేమ.. గురూజీకి కొత్త తలనొప్పి

By Asianet NewsFirst Published May 15, 2023, 9:43 AM IST
Highlights

సూపర్ స్టార్ మహేష్ బాబు, త్రివిక్రమ్ హ్యాట్రిక్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. గతంలో వీరిద్దరి కాంబోలో అతడు, ఖలేజా లాంటి చిత్రాలు వచ్చాయి. 

సూపర్ స్టార్ మహేష్ బాబు, త్రివిక్రమ్ హ్యాట్రిక్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. గతంలో వీరిద్దరి కాంబోలో అతడు, ఖలేజా లాంటి చిత్రాలు వచ్చాయి. ఈ చిత్రంలో పూజా హెగ్డే, శ్రీలీల హీరోయిన్లుగా నటిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. 

అయితే ఈ చిత్రానికి టైటిల్ సమస్య తీరడం లేదు. అయోధ్యలో అర్జునుడు, అమరావతికి అటు ఇటు అనే సాఫ్ట్ టైటిల్స్ ఇటీవల ప్రచారం అయ్యాయి. అమరావతికి అటు ఇటు ఆల్మోస్ట్ ఫిక్స్ అని.. రిజిస్టర్ కూడా చేసినట్లు వార్తలు వచ్చాయి. అయితే టైటిల్ వ్యవహారం మళ్ళీ మొదటికి వచ్చినట్లుతెలుస్తోంది . అయితే ఫ్యాన్స్ మాత్రం సాఫ్ట్ టైటిల్ వద్దు  మాస్ టైటిల్ కావాలని అంటున్నారు. 

Latest Videos

దీనితో ఆలోచనలో పడ్డ త్రివిక్రమ్, మహేష్ మరికొన్ని టైటిల్స్ పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. కథలో గుంటూరు ప్రస్తావన ఉంటుంది కాబట్టి గుంటూరు కారం, గుంటూరు అబ్బాయి అనే టైటిల్స్ పరిశీలిస్తున్నారట. గుంటూరు కారం అయితే కాస్త స్పైసీగా బావుందనే ఫీడ్ బ్యాక్ వస్తోంది. అంతా ఆమోదం తెలిపితే ఇదే ఫైనల్ అయ్యే ఛాన్స్ ఉంది. 

యాక్షన్ అండ్ ఫ్యామిలీ డ్రామాగా ఈ చిత్రం ఉండబోతున్నట్లు టాక్. రాజమౌళి చిత్రానికి ముందు మహేష్ చేస్తున్నచిత్రం ఇది. దీనితో ఈ మూవీపై అంచనాలు ఒక రేంజ్ లో ఉన్నాయి. ఏది ఏమైనా మహేష్ మూవీ టైటిల్ విషయం కాస్త గురూజీకి ఇబ్బందిగానే మారింది. 

click me!