అందరూ విజయ్ దేవరకొండ కోసమే వెయిటింగ్!

Published : Dec 06, 2018, 12:18 PM IST
అందరూ విజయ్ దేవరకొండ కోసమే వెయిటింగ్!

సారాంశం

టాలీవుడ్ లో సెన్సేషనల్ హీరోగా మారిపోయాడు విజయ్ దేవరకొండ. మీడియం రేంజ్ హీరోలందరినీ దాటేసి తనకంటూ ప్రత్యేకమైన మార్క్ ని క్రియేట్ చేసుకున్నాడు. 

టాలీవుడ్ లో సెన్సేషనల్ హీరోగా మారిపోయాడు విజయ్ దేవరకొండ. మీడియం రేంజ్ హీరోలందరినీ దాటేసి తనకంటూ ప్రత్యేకమైన మార్క్ ని క్రియేట్ చేసుకున్నాడు. యూత్ లో అతదికున్న ఫాలోయింగ్ చూసి స్టార్ హీరోలు సైతం ఆశ్చర్యపోతున్నారు.

విజయ్ దేవరకొండతో ఒక సినిమా తీస్తే బెటర్ అని భావిస్తోన్న దర్శకులు చాలా మంది విజయ్ దేవరకొండ కోసం వెయిట్ చేస్తున్నారు. వరుసగా సినిమాలు చేసే దర్శకుడు మారుతి సైతం విజయ్ దేవరకొండ కోసం ఎదురుచూస్తూ ఇప్పటివరకు మరో సినిమా అనౌన్స్ చేయలేదు.

తన దగ్గరున్న రెండు, మూడు కథలను విజయ్ కి వినిపించి ఓ కథను ఫైనల్ చేసుకోవాలని చూస్తున్నాడు. మారుతితో పాటు దర్శకుడు పూరిజగన్నాథ్, గోపీచంద్ మలినేని కూడా విజయ్ దేవరకొండతో సినిమాలు చేయాలని చూస్తున్నారు. కానీ విజయ్ మాత్రం ప్రస్తుతం చాలా బిజీగా ఉన్నాడు. 'డియర్ కామ్రేడ్' తో పాటు మరో సినిమాలో నటిస్తున్నాడు.

అలానే నాలుగు సినిమాల కోసం అడ్వాన్స్ లు తీసుకున్నాడు. పైగా ఏడాదికి ఒక సినిమా మాత్రమే చేస్తానని అంటున్నాడు. ఈ క్రమంలో మారుతి, పూరి లాంటి దర్శకులకు వెయిటింగ్ తప్పదు. మరి వీరంతా విజయ్ కోసం ఎదురుచూస్తారా లేక ఇతర హీరోలతో సినిమాలు చేస్తారా అనేది చూడాలి!

PREV
click me!

Recommended Stories

Akhanda 2 Review: 'అఖండ 2' మూవీ రివ్యూ, రేటింగ్.. బాలకృష్ణ తాండవం ఎలా ఉందో తెలుసా ?
సపోర్ట్ చేసినందుకు వెన్నుపోటు పొడిచిన కళ్యాణ్, మనస్తాపానికి గురైన భరణి.. తనూజ ఏడుపు ఫేక్ అంటూ ముఖం మీదే