చిన్ననాటి జ్ఞాపకాలు పంచుకున్న డైరెక్టర్ మారుతి, ఓ ఇంట్రెస్టింగ్ విషయం వెల్లడించిన దర్శకుడు

Published : Apr 10, 2023, 09:53 PM IST
చిన్ననాటి జ్ఞాపకాలు పంచుకున్న డైరెక్టర్ మారుతి, ఓ ఇంట్రెస్టింగ్ విషయం వెల్లడించిన దర్శకుడు

సారాంశం

తన చిన్ననాటి జ్ఞాపకాలు నెమరు వేసుకున్నారు డైరెక్టర్ మారుతి. చాలా కాలం తరువాత సోంత ఊరు వెళ్ళిన ఆయన అక్కడ ఓ ఇంట్రెస్టింగ్ విషయాన్ని వెల్లడించారు.   

స్టార్టు అయినా.. సామాన్యూలైనా.. సొంత ఊరు వదిలి ఎక్కడో సెటిల్ అయితే.. చాలా కాలం తరువాత తన ఊరు స్వర్గంలా కనిపిస్తుంది. వెళ్లిన ప్రతీసారి ఒకప్పటి జ్ఞపకాలను మూటకట్టుకుని మరీ తీసుకురావాలి అనిపిస్తుందతి. చిన్ననాటి మధుర అనుభూతులు వెంటపడి వస్తుంటాయి కూడా. ఇక ప్రస్తుతం అదే ఫీలింగ్ లో ఉన్నారు టాలీవుడ్ దర్శకుడు మారుతీ. తన సొంత ఊరు  మచిలీపట్నం వచ్చిన ఆయన చిన్ననాటి విషయాలు గుర్తు తెచ్చుకున్నారు. అభిమానులతో సోషల్ మీడియాలో శేర్ చేసుకున్నారు. అంతే కాదుఈసందర్భంగా ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ కూడా చెప్పారు. 

తాజాగా మారుతి తన సొంత ఊరు మచిలీపట్నం వెళ్ళాడు. అక్కడ చిన్ననాటి గురుతులను గుర్తుకు తెచ్చుకున్నాడు. తను చిన్నప్పుడు గడిపిన వ్యక్తులు, ప్లేస్ లను చూసుకున్నాడు. మరీ ముఖ్యంగా  తన ఊర్లో తాను చిన్నప్పుడు కటింగ్ చేయించుకున్న బార్బర్ ఫోటోని  ప్రత్యేకంగా సోషల్ మీడియాలో షేర్ చేశారు. మారుతి తన ఊరు మచిలీపట్నం వెళ్లగా అక్కడ ఆ బార్బర్ తో సెల్ఫీ దిగి ఆ ఫోటో, ఆ బార్బర్ ఫోటోని తన ట్విట్టర్ లో షేర్ చేశారు. ఇక  పోస్ట్ లో ఇంట్రెస్టింగ్ విషయాలు కూడా ఆయన రాసుకోచ్చారు. 

 

ఈయన పేరు సీతారామారావు.ఇప్పుడు ఈయనకు 100 ఏళ్ళు ఉంటాయి. మా ఊళ్లో ఆయన ను 100 ఏళ్ళ  బార్బర్ అంటారు. మా తాతయ్యకు, మా నాన్నకు, నాకు కూడా కటింగ్ చేశారు. నా చిన్నప్పుడు ఈయన దగ్గరే కటింగ్ చేయించుకున్నాను. ఈయన నా చిన్నప్పటి జ్ఞాపకం. ఈయన 100 ఏళ్ళు వచ్చినా ఇప్పటికి వర్క్ చేస్తున్నారు. ఈయన మరింత ఎక్కువ కాలం బతకాలి అని పోస్ట్ చేశారు. దాంతో ఈ పోస్ట్ తెగ వైరల్ అవుతోంది. అంతే కాదు మారుతి పోస్ట్ కు రకరకాల కామెంట్లు పెడుతున్నారు నెటిజన్లు. 

ఇక మారుతీ వరుస సినిమాలతో బిజీ అయిపోయాడు. గోపీచంద్ తో సినిమా వర్కౌట్ అవ్వకపోవడంతో.. ఈసారి పెద్ద ప్లానే వేశాడు. ప్రభాస్ తో పాన్ ఇండియా రేంజ్ లో .. రాజా డీలక్స్ మూవీ చేస్తున్నాడు మారుతి. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. ఈసినిమా హిట్ అయితే.. మారుతి పేరు బాలీవుడ్ రేంజ్ లో మారుమోగబోతుంది. ఇక సినిమా షూటింగ్ కు కాస్త విరామం ఇచ్చి సొంత ఊళ్లో రిలాక్స్ అవ్వడానికి వచ్చాడు మారుతి. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9: రీతూ కాదు, తనూజ వెంటపడేవాడిని.. షాకిచ్చిన డీమాన్‌ పవన్‌.. బిగ్‌ బాస్‌ ఎమోషనల్‌ జర్నీ
ఈ హీరోయిన్ నటించిన 4 సినిమాలు డిజాస్టర్లు.. కానీ పేరేమో మరో సావిత్రి