పెళ్లి ఊసే లేదు.. కానీ త్వరలో తండ్రి కాబోతున్న టాలీవుడ్ కమెడియన్..

Published : Nov 07, 2022, 01:17 PM IST
పెళ్లి ఊసే లేదు.. కానీ త్వరలో తండ్రి కాబోతున్న టాలీవుడ్ కమెడియన్..

సారాంశం

యంగ్ కమెడియన్ రాహుల్ రామకృష్ణ టాలీవుడ్ లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సొంతం చేసుకున్నాడు. కమెడియన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా దూసుకుపోతున్నాడు.

యంగ్ కమెడియన్ రాహుల్ రామకృష్ణ టాలీవుడ్ లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సొంతం చేసుకున్నాడు. కమెడియన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా దూసుకుపోతున్నాడు. అర్జున్ రెడ్డి, భరత్ అనే నేను, జాతి రత్నాలు లాంటి చిత్రాల్లో రాహుల్ రామకృష్ణ తనదైన మార్క్ ప్రదర్శించాడు. ఇటీవల రాహుల్ రామకృష్ణ ఆర్ఆర్ఆర్ చిత్రంలో కీలక పాత్రలో నటించిన సంగతి తెలిసిందే. 

కమెడియన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా రాహుల్ వరుస అవకాశాలు అందుకుంటున్నాడు. ఇదిలా ఉండగా రాహుల్ నెటిజన్లకు ఊహించని ట్విస్టులు ఇస్తున్నాడు. తాను త్వరలో తండ్రి కాబోతున్నట్లు రాహుల్ సోషల్ మీడియాలో అందమైన పోస్ట్ పెట్టాడు. తన భార్య గర్భవతిగా ఉన్న పిక్ షేర్ చేస్తూ.. 'మీట్ అవర్ లిటిల్ ఫ్రెండ్' అని కామెంట్ పెట్టాడు. 

తాను త్వరలో తండ్రి కాబోతున్న విషయాన్ని ఇలా ప్రకటించాడు. అయితే రాహుల్ పెళ్లి విషయంలో నెటిజన్లు తలలు బాదుకుంటున్నారు. అసలు పెళ్లి ఎప్పుడు అయింది బ్రో అంటూ ఫన్నీగా ప్రశ్నిస్తున్నారు. ఈ ఏడాది మే తాను త్వరలో పెళ్లి చేసుకోబోతున్నట్లు చెబుతూ తన భార్యకి లిప్ కిస్ ఇస్తున్న పిక్ షేర్ చేశాడు. ఆ తర్వాత పెళ్లి ఊసే లేదు. 

పెళ్లి జరిగినట్లు ఎలాంటి పిక్ కానీ, వీడియో రాహుల్ అభిమానులతో పంచుకోలేదు. కానీ ఇంతలో తన భార్య గర్భవతి అని ప్రకటించడంతో నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. ఏది ఏమైనా రాహుల్ తండ్రి కాబోతుండడంతో అభిమానులు శుభాకాంక్షలు చెబుతున్నారు. 

 

PREV
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9 title Winner: నాగార్జున డైలాగ్‌తో చెప్పి మరీ కప్‌ కొట్టిన కళ్యాణ్‌, ఎమోషనల్‌ కామెంట్‌.. తనూజకే క్రెడిట్‌
Bigg Boss Telugu 9: రమ్య మోక్ష చేత అందరి ముందు క్షమాపణలు చెప్పించిన కళ్యాణ్‌.. పరువు పోయిందిగా