#Prabhas:'బ్యాన్ నెట్ ఫ్లిక్స్'..ప్రభాస్ ఫ్యాన్స్ పిలుపు,అసలేం జరిగింది?

By Surya PrakashFirst Published Nov 7, 2022, 10:42 AM IST
Highlights

ఈ ట్వీట్  చూసిన ప్రభాస్ అభిమానులు మండిపడుతున్నారు. ప్రముఖ ఓటీటీ సంస్థలలో ఒకటైన నెట్ఫ్లిక్స్ తమ అభిమాన హీరో ప్రభాస్ ను ఇంత దారుణంగా అవమానించడం సరికాదు అని కామెంట్ల వర్షం కూడా వెలువడుతోంది . 


 తెలుగు హీరోలకు ఉండే ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ముఖ్యంగా సోషల్ మీడియాలో తమ అభిమాన హీరోలు గురించి వారు చేసే రచ్చ ఓ రేంజిలో ఉంటుంది. తాజాగా ప్రభాస్ అభిమానులు బ్యాన్ నెట్ ప్లిక్స్ అంటూ పిలుపు ఇచ్చారు. ఇది ఇప్పుడు ట్రెండ్ అవుతోంది. కారణం...తమ హీరోని అవమానించటమే అంటున్నారు. అసలేం జరిగింది.

 ప్రభాస్ నటించిన సాహో సినిమా సమయంలో  నెగిటివ్ టాక్ వచ్చినప్పటికీ మొదటి రోజు కలెక్షన్లు మాత్రం రికార్డు స్థాయిలో నమోదయ్యాయి. హిందీలో ఈ సినిమా అంచనాలకు మించి సక్సెస్ అవ్వడం ప్రభాస్ క్రేజ్ ను మరింత పెంచడం కూడా జరిగిపోయింది. ముఖ్యంగా ఈ సినిమాలోని యాక్షన్స్ సన్నివేశాలు కొంతమంది ప్రేక్షకులకు విపరీతంగా నచ్చాయి.  ఇదిలా ఉండగా తాజాగా ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ప్లిక్స్ ఇండోనేషియా.. సాహో సినిమాలోని ప్రభాస్ వీడియోను పోస్ట్ చేసి ఇదే యాక్షన్ ? అంటూ సెటైరికల్ గా ట్వీట్ చేయడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.

ఈ ట్వీట్  చూసిన ప్రభాస్ అభిమానులు మండిపడుతున్నారు. ప్రముఖ ఓటీటీ సంస్థలలో ఒకటైన నెట్ఫ్లిక్స్ తమ అభిమాన హీరో ప్రభాస్ ను ఇంత దారుణంగా అవమానించడం సరికాదు అని కామెంట్ల వర్షం కూడా వెలువడుతోంది . కొంతమంది నెటిజెన్స్ నెట్ ఫ్లిక్స్ ను అన్ సబ్స్క్రయిబ్ చేస్తామంటూ చెబుతుండగా మరి కొంతమంది కాదు నెట్ ఫ్లిక్స్ ను బ్యాన్ చేయాలి అంటూ కామెంట్లు చేస్తున్నారు. గతంలోనూ ప్రభాస్ పుట్టిన రోజుకు బాహుబలిలో ప్రభాస్ లుక్ ని షేర్ చేస్తూ...శివలింగం ప్లేస్ లో కేకు పెట్టింది నెట్ ప్లిక్స్ అని గుర్తు చేస్తున్నారు. 
 
 సినిమా సినిమాకు ప్రభాస్ రేంజ్ బాగా పెరుగుతుండడంతో తట్టుకోలేక ప్రముఖ ఓటీటీ అయిన నెట్ ఫ్లిక్స్ ప్రభాస్ ను టార్గెట్ చేస్తోంది అంటూ కూడా కొంతమంది కామెంట్లు చేస్తున్నారు. కానీ ప్రభాస్ ను టార్గెట్ చేయడం వల్ల వారికి ఏం ఒరుగుతుంది అనే కామెంట్లు కూడా వినిపిస్తున్నాయి. మరి దీనిపై నెట్ ప్లిక్స్ ఏ విధంగా స్పందిస్తుందో తెలియాల్సి ఉంది.

click me!