టాలీవుడ్‌లో మరో విషాదం.. పూజా హెగ్డే,తమన్ ట్వీట్స్

Surya Prakash   | Asianet News
Published : Apr 17, 2021, 01:59 PM IST
టాలీవుడ్‌లో మరో విషాదం.. పూజా హెగ్డే,తమన్ ట్వీట్స్

సారాంశం

కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్‌లోకి ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం ఉదయం తుది శ్వాస విడిచారు. 

ఉదయమే కోలివుడ్ హాస్య నటుడు వివేక్ మృతి వార్త అందరినీ కలిచివేసింది. అది మరవక ముందే టాలీవుడ్ ని మరో మరణ వార్త బాధా సముద్రంలో ముంచెత్తింది. ప్రముఖ కో డైరెక్టర్‌ సత్యం కన్నుమూశారు. కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్‌లోకి ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం ఉదయం తుది శ్వాస విడిచారు. సత్యం మరణ వార్తతో టాలీవుడ్‌లోని ప్రముఖులంతా షాక్‌కు గురవుతున్నారు. 

ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేస్తున్నారు. సత్యం మరణవార్త విని పూజా హెగ్డె భావోద్వేగానికి గురైంది.  ‘మా కోడైరెక్టర్ సత్యం గారి మరణ వార్త విని షాక్‌కు గురయ్యాను. ఆయనతో అరవింద సమేత వీర రాఘవ, సాక్ష్యం, అల.. వైకుంఠపురములో చిత్రాలు చేశాను. ఆయన కుటుంబానికి సానుభూతి తెలుపుతున్నా' అంటూ ట్వీట్‌ చేసింది. అలాగే తమన్ సైతం ఆయన మరణవార్త తనను షాక్ కు గురి చేసిందంటూ ట్వీట్ చేసారు.

కాగా, సుధీర్ఘ సీనీ కెరీర్‌లో కోడైరెక్టర్‌ సత్యం ఎన్నో సినిమాలకు పనిచేశాడు. కృష్ణవంశీ, రాజమౌళి, త్రివిక్రమ్‌ లాంటి స్టార్‌ డైరెక్టర్ల వద్ద కో డైరెక్టర్‌గా పనిచేశాడు. రాజమౌళి-నితిన్‌ కాంబోలో వచ్చిన సూపర్‌ హిట్‌ మూవీ ‘సై’కి చీఫ్‌ కో డైరెక్టర్‌గా వ్యవహరించాడు. అలాగే మగధీర, మర్యాద రామన్న లాంటి సినిమాలకు అసిస్టెంట్‌ దర్శకుడిగా పనిచేశాడు. త్రివిక్రమ్‌ తెరకెరక్కించిన ‘అల..వైకుంఠపురంలో’కి కో డైరెక్టర్‌గా పనిచేశాడు. విటితో పాటు శ్రీరామదాసు, చందమామ, సాక్ష్యం సినిమాలకు కో డైరెక్టర్‌గా సేవలందించారు. 
 

PREV
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9: చివరి రోజు ఓటింగ్‌ తలక్రిందులు, పక్కా ప్లాన్‌ ప్రకారమే.. టాప్‌లో ఉన్నదెవరంటే?
Karthika Deepam 2 Today Episode: దీప, కార్తీక్ లపై రెచ్చిపోయిన పారు, జ్యో- శ్రీధర్ పదవి పోయినట్లేనా?