కరోనా వచ్చిందని నిర్దాక్ష్యణ్యంగా నిర్మాత ...

By Surya PrakashFirst Published Apr 17, 2021, 1:04 PM IST
Highlights

బాలకృష్ణ స్థానంలో ఇంకో నటుడ్ని తీసుకున్నారట సదరు సినిమా టీం. ఈ విషయంలో ఆదర్శ్ బాలకృష్ణ చాలా ఫీలయ్యాడు.

కొన్ని విషయాలు ఎటూ చెప్పలేనట్లుగా ఉంటాయి. కరోనా వచ్చి అందరి జీవితాలను తల క్రిందులు చేసే పోగ్రాం పెట్టుకుంది. ఇప్పటికే చాలా మంది కెరీర్ లు పోగొట్టుకుని నిరాశలో ఉన్నారు. ముఖ్యంగా సినిమావాళ్లు చాలా డీలా పడిపోతున్నారు. అయితే కరోనా పరిస్దితులను అర్దం చేసుకున్న వాళ్లు తమ టీమ్ కు అన్యాయం జరగకుండా చూసుకుంటారు. అయితే ఆ క్రమంలో నిర్మాత నష్టపోకుండా చూసుకుండా చూసుకోవటం కూడా వసరమే. ఇదంతా ఎందుకు చెప్పాల్సి వచ్చింది అంటే...

సినీ ఆర్టిస్ట్ ఆదర్శ్ బాలకృష్ణకి కరోనా వచ్చింది. కేవలం ఆయనకే కాదు ఇంట్లో ఉన్న అందరికి కరోనా సోకింది. ఆయన పేరెంట్స్ ని ఆసుపత్రిలో చేర్పించాడు. ఇదే విషయాన్ని తాను నటిస్తున్న ఒక సినిమా యూనిట్ కి తెలిపాడట. అంతే, ఆదర్శ్ బాలకృష్ణ ఆ సినిమాలో  చెయ్యాల్సిన ఆ క్యారక్టర్  నుంచి అతన్ని తొలగించేసారు. బాలకృష్ణ స్థానంలో ఇంకో నటుడ్ని తీసుకున్నారట సదరు సినిమా టీం. ఈ విషయంలో ఆదర్శ్ బాలకృష్ణ చాలా ఫీలయ్యాడు. తన ప్లేస్ లో ఇంకొకర్ని తీసుకుంటున్న విషయాన్ని ఆ సినిమా దర్శకనిర్మాతలు తనకు చెప్పకపోవడం పై ఆదర్శ్ బాగా ఫీల్ అయినట్టు సమాచారం.  తన పట్ల ఆ సినిమా టీం అలా ప్రవర్తించడాన్ని ఆదర్శ్ భరించలేకపోతున్నాడటు  తన పట్ల జరిగిన ఈ దురదృష్టకరమైన సంఘటన గురించి ఆదర్శ్ తన ట్విట్టర్ లో  పోస్ట్ చేస్తూ.. తన ఫాలోవర్స్ తో షేర్ చేసుకున్నాడు.
 
ఓ రకంగా చూస్తే నటుడు ఆదర్శ్ బాలకృష్ణ విషయంలో జరిగింది ఖచ్చితంగా అన్యాయమే.  కరోనా కావాలని తెచ్చుకునేది కాదు. బయిట విజృంభణ బాగా ఉంది. ఈ క్రమంలో కరోనా చాలా మందికి సోకుతోంది. అయితే సినిమా అనేది కోట్లతో కూడిన వ్యవహారం. చిన్న ఆర్టిస్ట్ కోసం వెయిట్ చేస్తే నష్టాలు దారుణంగా ఉంటాయి. మిగతా ఆర్టిస్ట్ ల డేట్స్ తో ఇబ్బంది అవుతుంది. దాంతో ఇలాంటి సమయాల్లో దర్శక,నిర్మాతలు కాస్త కఠినంగా అనిపించినా ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటూంటారు. ఇక్కడ ఎవరిది తప్పు, ఒప్పు అనేది డిసైడ్ చేయలేం. 
 

click me!