ఓటింగ్ కేంద్రాలకు పోటెత్తిన టాలీవుడ్ సెలబ్స్

By team teluguFirst Published Dec 1, 2020, 4:36 PM IST
Highlights

యంగ్ హీరో నిఖిల్ సైతం తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఆయన ఓటు వేసినట్లు సూచికగా, వేలికి రాసిన సిరా చూపించారు. అలాగే నిర్మాత మధుర శ్రీధర్ రెడ్డి, మరో నిర్మాత రాజ్ కందుకూరి ఓటు హక్కును వినియోగించుకోవడం జరిగింది. మంచి పాలన కావాలంటే, మంచి నాయకుడిని ఎన్నుకోవాలి. ఆ భాద్యత ప్రజలకు ఉందని తెలియజేయడం కోసం, టాలీవుడ్ ప్రముఖులు ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు.

వాడివేడిగా సాగిన ఎన్నికల ప్రచార వేడికి తెరపడింది. నేడు జి హెచ్ ఎమ్ సి ఎన్నికలు కావడంతో  టాలీవుడ్ సెలెబ్రిటీలు ఓటింగ్ కేంద్రాలకు పోటెత్తారు. నగరంలో ఉన్న అనేక మంది టాలీవుడ్ ప్రముఖులు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. మెగాస్టార్ చిరంజీవి, భార్యతో కలిసి ఓటు హక్కును వినియోగించుకున్నారు. అల్లు అర్జున్ భార్య స్నేహారెడ్డి కూడా ఓటు వేయడం జరిగింది. విజయ్ దేవరకొండ, హీరో రామ్, రాజేంద్ర ప్రసాద్, బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ఓటు హక్కు వినియోగించుకున్న సెలెబ్రిటీల జాబితాలో ఉన్నారు. 

యంగ్ హీరో నిఖిల్ సైతం తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఆయన ఓటు వేసినట్లు సూచికగా, వేలికి రాసిన సిరా చూపించారు. అలాగే నిర్మాత మధుర శ్రీధర్ రెడ్డి, మరో నిర్మాత రాజ్ కందుకూరి ఓటు హక్కును వినియోగించుకోవడం జరిగింది. మంచి పాలన కావాలంటే, మంచి నాయకుడిని ఎన్నుకోవాలి. ఆ భాద్యత ప్రజలకు ఉందని తెలియజేయడం కోసం, టాలీవుడ్ ప్రముఖులు ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. 

కొద్దిరోజులుగా సోషల్ మీడియాలో సైతం టాలీవుడ్ స్టార్స్ అందరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని ప్రచారం చేస్తున్నారు. ఐతే టాలీవుడ్ టాప్ స్టార్స్ కొందరు ఈ ఓటింగ్ లో పాల్గొనలేదు. షూటింగ్ బిజీ కారణంగా కొందరు ఓటు వేయకుండా డుమ్మా కొట్టారు. ఆర్ ఆర్ ఆర్ షూటింగ్ లో బిజీగా ఉన్న ఎన్టీఆర్, రామ్ చరణ్ ఓటు వేయలేదు. పుష్ప షూటింగ్ లో ఉన్న అల్లు అర్జున్ సైతం ఓటు హక్కు వినియోగించుకోలేదు. 
 
click me!