
కొద్దిరోజుల క్రితం పుల్వామాలో నలభై మందికి పైగా జవాన్లు ఉగ్రదాడి కారణంగా మృత్యువాత పడ్డారు. దీంతో ఉగ్రవాదులపై ప్రతీకారం తీర్చుకుంది భారత ప్రభుత్వం.
మంగళవారం తెల్లవారుజామున పాక్ ఆక్రమిత కశ్మీర్ లోని ఉగ్ర శిబిరాలపై ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వైమానిక దాడులు నిర్వహించింది. ఈ దాడిలో రెండు వందల నుండి మూడు వందల మంది తీవ్రవాదులు హతమయ్యుంటారని భావిస్తున్నారు.
ఈ చర్యపై ప్రతీ ఒక్కరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు. సినీ తారలు సైతం భారత సైన్యాన్ని ప్రశంసిస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ లు పెడుతున్నారు. ఎన్టీఆర్, మహేష్ బాబు, రాజమౌళి, రామ్ చరణ్, కమల్ హాసన్, అఖిల్, వరుణ్ తేజ్, ఉపాసన ఇలా టాలీవుడ్ సెలబ్రిటీలతో పాటు బాలీవుడ్ సెలబ్రిటీలు కూడా తమ ఆనందాన్ని అభిమానులతో పంచుకుంటున్నారు.