డాషింగ్ డైరెక్టర్ పూరికి సెలెబ్రిటీల బర్త్ డే విషెష్!

Published : Sep 28, 2019, 07:34 PM ISTUpdated : Sep 28, 2019, 07:38 PM IST
డాషింగ్ డైరెక్టర్ పూరికి సెలెబ్రిటీల బర్త్ డే విషెష్!

సారాంశం

డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ప్రేక్షకులకు వినోదాన్ని అందించే చిత్రాలు తెరకెక్కించడంలో పూరి స్టయిలే వేరు. నేడు పూరి జగన్నాధ్ తన 53వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా సోషల్ మీడియాలో సెలెబ్రిటీలు పూరికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. 

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన బద్రి చిత్రంతో పూరి తన సినీ కెరీర్ ని దర్శకుడిగా ప్రారంభించారు. బద్రి సూపర్ హిట్ కావడంతో మరిన్ని అవకాశాలు ఈ డాషింగ్ డైరెక్టర్ ని వెతుక్కుంటూ వచ్చాయి. ఇడియట్ చిత్రం పూరీని టాలీవుడ్ లో ప్రధాన దర్శకుడిగా మార్చేసింది. 

అమ్మా నాన్న ఓ తమిళమ్మాయి, శివమణి లాంటి వరుస హిట్లతో పూరి స్టార్ హీరోలందరికీ ఫేవరిట్ డైరెక్టర్ గా మారిపోయారు. ఇక సూపర్ స్టార్ మహేష్ తో తెరకెక్కించిన పోకిరి చిత్రం తెలుగు చిత్ర పరిశ్రమలో సరికొత్త రికార్డులు నెలకొల్పింది. ఆ తర్వాత చిరుత, దేశముదురు చిత్రాలతో పూరి తన జైత్ర యాత్రని కొనసాగించారు. 

మధ్యలో ఎదురైనా కొన్ని పరాజయాలతో పూరి కెరీర్ కాస్త నెమ్మదించింది. కానీ ఇటీవల విడుదలైన ఇస్మార్ట్ శంకర్ చిత్రంతో పూరి సత్తా మరోసారి బయటపడింది. ఇస్మార్ట్ శంకర్ చిత్రం ఘనవిజయం సాధించింది. పూరి జగన్నాధ్ బర్త్ డే సందర్భంగా సెలెబ్రిటీలు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. 

 

PREV
click me!

Recommended Stories

Akhanda 2 New Date: అఖండ 2 మూవీ కొత్త రిలీజ్‌ డేట్‌.. బాలయ్య ఊహించని సర్‌ప్రైజ్‌, ఈ సినిమాలకు పెద్ద దెబ్బ
Venkatesh: `నువ్వు నాకు నచ్చావ్‌` మూవీతో పోటీ పడి చిత్తైపోయిన నాగార్జున, మోహన్‌ బాబు చిత్రాలివే