టాలీవుడ్ లో విషాదం చోటుచేసుకుంది. చిత్ర పరిశ్రమలో కొరియోగ్రాఫర్ గా ఎదగాలని ప్రయత్నిస్తున్న ఓ యువకుడు ప్రమాదవశాత్తు షార్ట్ సర్క్యూట్ వల్ల మరణించాడు.
టాలీవుడ్ లో విషాదం చోటుచేసుకుంది. చిత్ర పరిశ్రమలో కొరియోగ్రాఫర్ గా ఎదగాలని ప్రయత్నిస్తున్న ఓ యువకుడు ప్రమాదవశాత్తు షార్ట్ సర్క్యూట్ వల్ల మరణించాడు. ఈ సంఘటన హైదరాబాద్ మణికొండ లోని శ్రీరాం నగర్ కాలనీలో చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళితే.. హైదరాబాద్ లో కొరియోగ్రాఫర్ గా పనిచేస్తున్న ఆ యువకుడు పేరు పోరేటి వీరేందర్ రెడ్డి (38). అతని స్వస్థలం వరంగల్. హైదరాబాదులో కొరియోగ్రాఫర్ గా పని చేస్తూ టాలీవుడ్ లో అవకాశాల కోసం ప్రయత్నిస్తున్నాడు. అతడు శ్రీరామ్ నగర్ కాలనీలో కుతుబ్ ఆర్కేడ్ అపార్ట్మెంట్లో 301 ఫ్లాట్లో నివాసం ఉంటున్నాడు.
తన ఫ్లాట్ లో వీరేందర్ నిద్రపోతున్న సమయంలో అర్ధరాత్రి దాటాక ఏసీ షార్ట్ సర్క్యూట్ కి గురి అయింది. వెంటనే గదిలో మంటలు వ్యాపించాయి. ఫర్నిచర్ కాలిపోయి దట్టంగా పొగలు వ్యాపించాయి. చుట్టుపక్కల ఉన్నవారు అగ్ని ప్రమాదం జరుగుతుందని గమనించి వెంటనే 100కి డయల్ చేశారు. దీంతో అక్కడికి పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది చేరుకున్నారు. మంటలు అదుపులోకి తీసుకువచ్చి గదిలోకి వెళ్లే లోపే వీరేందర్ అపస్మారక స్థితిలో కనిపించాడు.
ఒక ఊపిరితిత్తుల్లోకి పొగ చేరడం వల్ల అప్పటికే వీరేందర్ మరణించాడని పోలీసులు తెలిపారు. పోలీసులు విద్యుత్ శాఖకు కూడా సమాచారం ఇచ్చి ఏసి షార్ట్ సర్క్యూట్ కావడానికి గల కారణాలు అడిగారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. షార్ట్ సర్క్యూట్ వల్ల విషాదకరంగా ఎంతో భవిష్యత్తు ఉన్న యువకుడు ప్రాణాలు కోల్పోయాడు.