రాజ్ తరుణ్ కారుకి యాక్సిడెంట్.. త్రుటిలో తప్పిన ప్రమాదం!

Published : Aug 20, 2019, 10:45 AM ISTUpdated : Aug 20, 2019, 10:56 AM IST
రాజ్ తరుణ్ కారుకి యాక్సిడెంట్.. త్రుటిలో తప్పిన ప్రమాదం!

సారాంశం

టాలీవుడ్‌ యంగ్‌ హీరో రాజ్‌తరుణ్‌కు పెను ప్రమాదం తప్పింది. ఆయన ప్రయాణిస్తున్న కారు నార్సింగ్‌ సమీపంలో అల్కాపూర్‌ వద్ద ఔటర్‌ రింగ్‌రోడ్డుపై ప్రమాదానికి గురైంది.  

హీరో తరుణ్ కారుకి యాక్సిడెంట్ జరిగిందంటూ సోషల్ మీడియా, టీవీలలో వార్తలు హల్చల్ చేయడంతో వెంటనే స్పందించిన తరుణ్ తనకు ఎలాంటి యాక్సిడెంట్ జరగలేదని.. తన కారు క్షేమంగానే ఉందని వెల్లడించాడు. యాక్సిడెంట్ జరిగిన మాట వాస్తవమే.. కానీ అది తరుణ్ కారుకి కాదు.. కుర్ర హీరో రాజ్ తరుణ్ కారుకి అని తెలుస్తోంది.

పేర్లు ఒకటే కావడంతో ఈ కన్ఫ్యూజన్ ఏర్పడింది. నిన్న రాత్రి నార్సింగ్ సమీపంలో అల్కాపూర్ వద్ద ఔటర్ రింగ్ రోడ్డుపై రాజ్ తరుణ్ కారు ప్రమాదానికి గురైంది. ఈ ఘటన మంగళవారం తెల్లవారు జామున చోటుచేసుకుంది.

రాజ్‌తరుణ్‌ ఈ ప్రమాదం నుంచి క్షేమంగా బయటపడినట్టు తెలిసింది. కారు డివైడర్‌ను డీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. కారు అద్దాలు ధ్వంసమయ్యాయి.  యాక్సిడెంట్‌  అనంతరం ఆయన వేరే కారులో వెళ్లిపోయినట్టు స్థానికులు చెబుతున్నారు. 

ప్రమాదానికి గల కారణాలు తెలుసుకోవడానికి పోలీసులు దర్యాఫ్తు చేస్తున్నారు. కారుని రోడ్డు పక్కనే వదిలేసి వెళ్లడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇక సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం ఈ కుర్రహీరో 'ఇద్దరి లోకం ఒకటే' అనే సినిమాలో నటిస్తున్నారు. 

PREV
click me!

Recommended Stories

Akhanda 2 Review: 'అఖండ 2' మూవీ రివ్యూ, రేటింగ్.. బాలకృష్ణ తాండవం ఎలా ఉందో తెలుసా ?
సపోర్ట్ చేసినందుకు వెన్నుపోటు పొడిచిన కళ్యాణ్, మనస్తాపానికి గురైన భరణి.. తనూజ ఏడుపు ఫేక్ అంటూ ముఖం మీదే