కమెడియన్ పేరు వాడుకొని ఏం చేశాడంటే..?

By Udayavani DhuliFirst Published Sep 18, 2018, 11:08 AM IST
Highlights

ప్రముఖ కమెడియన్ కమ్ హీరో శ్రీనివాస్ రెడ్డి పేరుతో ఓ వ్యక్తి నకిలీ ఫేస్ బుక్ ఖాతాలను తెరిచి పలువురిని మోసం చేయడం వెలుగులోకి వచ్చింది. ఈ విషయం తెలుసుకున్న శ్రీనివాస్ రెడ్డి సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు. 

వివరాల్లోకి వెళితే.. అమీర్ పేట్ ప్రాంతానికి చెందిన రవికిరణ్ గతంలో కొన్నాళ్లపాటు పలువురు ఆర్టిస్టుల కింద అసిస్టెంట్ గా పని చేశారు. ఆ పరిచయాలను అడ్డం పెట్టుకొని నకిలీ ఫేస్ బుక్ ఐడీలను సృష్టించి, సినిమా అవకాశాలను ఇప్పిస్తానని, మంచి కథలు ఉంటే పంపాలని చాలా మందితో చాట్ చేస్తున్నాడు. నటుడు శ్రీనివాస్ రెడ్డి పేరుతో కూడా ఐడీ సృష్టించి దాని ద్వారా చాలా మందితో మాట్లాడాడు.

సినిమా కథలు ఉంటే అవకాశాలు ఇప్పిస్తానని కొందరితో చెప్పడంతో నిజంగానే శ్రీనివాస్ రెడ్డి అనుకొని కొందరు అనేక విషయాలను పంచుకున్నారు. ఈ విషయం శ్రీనివాస్ రెడ్డి వరకు వెళ్లడంతో ఆయన వెంటనే స్పందించి తన పేరుని ఎవరో వాడుకుంటున్నారని సైబరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు రవికిరణ్ ని అదుపులోకి తీసుకొని కౌన్సెలింగ్ ఇప్పించి, హెచ్చరించి విడిచిపెట్టారు. 

click me!