హీరోయిన్‌కు సల్మాన్‌ విషెస్‌.. మెమరబుల్‌ గిఫ్ట్ ఇచ్చిన డైరెక్టర్

Published : Aug 12, 2020, 09:48 AM IST
హీరోయిన్‌కు సల్మాన్‌ విషెస్‌.. మెమరబుల్‌ గిఫ్ట్ ఇచ్చిన డైరెక్టర్

సారాంశం

తన కో స్టార్‌కు సోషల్ మీడియా మీదగా శుభాకాంక్షలు తెలిపాడు సల్మాన్. జాక్వెలిన్‌, సల్మాన్‌లు సినిమాలతో పాటు పలు సింగిల్స్‌ కోసం కలిసి పనిచేశారు. త్వరలో కిక్‌ 2లోనూ మరోసారి స్క్రీన్‌ షేర్ చేసుకునేందుకు రెడీ అవుతున్నారు ఈ జంట.

బాలీవుడ్ బ్యూటీ జాక్వెలిన్‌ ఫెర్నాండెజ్‌ మంగళవారం తన 35 వ పుట్టిన రోజును గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుంది. అయితే ఈ వేడుకను బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్‌ ఖాన్ మరింత స్పెషల్‌గా మార్చేశాడు. తన కో స్టార్‌కు సోషల్ మీడియా మీదగా శుభాకాంక్షలు తెలిపాడు సల్మాన్. జాక్వెలిన్‌, సల్మాన్‌లు సినిమాలతో పాటు పలు సింగిల్స్‌ కోసం కలిసి పనిచేశారు. త్వరలో కిక్‌ 2లోనూ మరోసారి స్క్రీన్‌ షేర్ చేసుకునేందుకు రెడీ అవుతున్నారు ఈ జంట.

జాక్వెలిన్‌కు శుభాకాంక్షలు తెలుపుతూ తనతో కలిసి దిగిన ఓ ఫోటోను షేర్ చేశాడు సల్మాన్‌.  ఆ ఫోటోతో పాటు `హ్యాపీ బర్త్‌ డే జాకీ.. నువ్వు ఎప్పుడు సంతోషంగా ఉండాలి` అంటూ కామెంట్ చేశాడు. ఈ ఫోటోలో సల్మాన్ బ్లూ టీ షర్ట్‌లో కనిపిస్తుండగా జాక్వెలిన్‌ బ్లాక్‌ టీషర్ట్‌ లో హాట్‌గా కనిపిస్తోంది. జాక్వెలిన్‌ పుట్టిన రోజు సందర్భంగా ఫిలిం మేకర్‌ సాజిద్‌ నదియావాలా కిక్‌ 2ను ఎనౌన్స్ చేశాడు. సాజిద్ భార్య వార్దా ఈ మేరకు ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది.

`నీకు ఎప్పటికీ గుర్తుండిపోయే బర్త్ డే గిఫ్ట్ ఇదిగో. సాజిద్‌ నదియావాలా ఉదయం 4 గంటలకు స్క్రిప్ట్ లాక్ చేశాడు నీకు అద్భుతమైన పాత్ర క్రియేట్ చేశాడు. సల్మాన్‌ ఖాన్ కిక్‌ 2 త్వరలో ప్రారంభం కానుంది. వెల్‌ కం బ్యాక్‌` అంటూ పోస్ట్ చేశారు. 

PREV
click me!

Recommended Stories

ఆ స్టార్ హీరో వల్ల కెరీర్ నాశనం చేసుకున్న భూమిక, నగ్మా, స్నేహ ఉల్లాల్.. లిస్టులో మొత్తం ఏడుగురు బాధితులు
BMW Teaser: 'భర్త మహాశయులకు విజ్ఞప్తి' టీజర్ రివ్యూ.. వరుస డిజాస్టర్లతో రూటు మార్చిన రవితేజ, రొమాన్స్ షురూ