మహేష్, త్రివిక్రమ్ చిత్రం టైటిల్ ఫైనల్, ఇదే??

Published : May 11, 2023, 11:17 AM IST
 మహేష్, త్రివిక్రమ్ చిత్రం టైటిల్ ఫైనల్, ఇదే??

సారాంశం

 ఈ సినిమా నుండి అప్డేట్స్ ఎప్పుడెప్పుడు వస్తాయా అని అభిమానులు ఆసక్తిగా చూస్తున్నారు. అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాకు టైటిల్ ఫైనలైజ్ చేసారు.  


సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం తన కెరీర్‌లోని 28వ చిత్రాన్ని మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ డైరెక్షన్‌లో తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమాలో మహేష్ సరికొత్త లుక్‌లో కనిపిస్తుండటంతో ఈ సినిమా నుండి అప్డేట్స్ ఎప్పుడెప్పుడు వస్తాయా అని అభిమానులు ఆసక్తిగా చూస్తున్నారు. అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాకు టైటిల్ ఫైనలైజ్ చేసారు. ఆ టైటిల్ అఫీషియల్ గా ప్రకటించలేదు కానీ సోషల్ మీడియాలో డిస్కషన్ గా మారింది.

 #SSMB28 చిత్రానికి  'అమరావతి కి అటు ఇటు...' ఫైనలైజ్ చేసే అవకాసం ఉంది. అయితే మరో రెండు టైటిల్స్ కూడా డిస్కషన్ లో ఉన్నట్లు చెప్పుకుంటున్నారు.  
 నెలాఖరు టైటిల్ తో పోస్టర్ రిలీజ్ చేస్తారంటున్నారు. అడవిలో అర్జునుడు, ఆమె కథ, అమ్మ కథ, అమరావతికి అటు ఇటు లాంటి టైటిల్స్ ప్రచారంలో ఉన్నాయి. మరి వీటిలో ఏది ఫైనల్ అవుతుందో వేచి చూడాలి. ఇటీవల ఉగాది కానుకగా సినిమా టైటిల్‌ను ప్రకటిస్తారని జోరుగా ప్రచారం జరిగింది. కానీ అది సాధ్యం కాలేదు.

ఇక మహేష్,త్రివిక్రమ్ ముచ్చటగా మూడోసారి వీళ్లిద్దరూ కలిసి పనిచేస్తుండటంతో మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అతడు, ఖలేజా తర్వాత వీరి కాంబోలో రాబోతున్న ఈ చిత్రంలో పూజా హెగ్డే కథానాయికగా చేస్తోంది. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.  SSMB28 అనే వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కుతోన్న ఈ సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతి కానుకాగ విడుదల చేయనున్నారు మేకర్స్. జనవరి 13న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు ప్రకటించారు.  

ఈ సినిమాలో మహేష్ బాబు సరసన ఈ చిత్రంలో పూజా హెగ్డే హీరోయిన్‌గా చేస్తోంది. ఈ సినిమాకు హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై సూర్య దేవర నాగవంశీ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. పీఎస్ వినోద్ సినిమాటోగ్రాఫర్‌గా పనిచేస్తున్నారు. నవీన్ నూలి ఎడిటిగ్ బాధ్యతలు చూస్తున్నారు. మహేశ్ బాబుకు ఇది 28వ చిత్రం కావడం గమనార్హం. తమన్ సంగీతాన్ని సమకూరుస్తున్నారు. వచ్చే ఏడాది జనవరి 13న సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుందీ చిత్రం. 

PREV
click me!

Recommended Stories

Sanjana Remuneration : విన్నర్ రేంజ్ లో పారితోషికం అందుకున్న సంజన గల్రానీ, 15 వారాలు బిగ్ బాస్ హౌస్ లో ఉన్నందుకు ఎంత ఇచ్చారంటే?
Bigg Boss Telugu 9 : తనూజ తో ఐటమ్ సాంగ్ చేయిస్తానన్న ఇమ్మాన్యుయేల్, అడ్డంగా బుక్కైన డీమాన్ పవన్.. హౌస్ లో చివరి రోజు సందడి