బ్యానర్ కు డైరక్టర్ బాబీ కండీషన్, బాలయ్యతో సెట్ అయ్యింది

Published : May 11, 2023, 06:23 AM IST
బ్యానర్ కు   డైరక్టర్ బాబీ కండీషన్, బాలయ్యతో సెట్ అయ్యింది

సారాంశం

బాబీ ఓ కండీషన్ పెట్టాడు. అది నెరవేర్చిన సితార బ్యానర్ తో ముందుకు వెళ్తున్నాడు అంటున్నారు. 

కొంతమంది డైరక్టర్స్ ఆఫర్స్  కోసం ఎదురు చూస్తారు.. మరికొందరు తమకు ఎలాంటి ఆఫర్ కావాలి...ఏ బ్యానర్, ఏ హీరోతో చేస్తే బెస్ట్ అనే విషయాలపై పిచ్చ క్లారిటీగా ఉంటారు. వాళ్ల ఆలోచనలు అన్ని ఆ విషయాలు చుట్టూనే ఉంటూ స్ట్రాటజీగా ముందుకు వెళ్తారు. అందుకే తాము ఎక్సెప్క్ట్ చేసిన ఆఫర్ రాగానే సాలిడ్ హిట్ కొట్టి ప్రూవ్ చేసుకుంటారు. పేరు, నమ్మకం తో డబ్బు సంపాదించుకుంటారు.సెటిల్ అవుతారు.తెలుగు లో మొన్న సంక్రాంతికి ‘వాల్తేరు వీరయ్య’ సినిమాతో సాలిడ్ హిట్ ఇచ్చిన డైరక్టర్ బాబి. ఒక మెగా అభిమానిగా.. మెగా ఫ్యాన్స్ ని కాలర్ ఎగరేసుకునే సినిమా చేశాడు దర్శకుడు బాబీ. మెగాస్టార్ చిరంజీవి ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని.. వింటేజ్ చిరుని చూపించి సూపర్ హిట్ ఇచ్చాడు బాబీ. వరల్డ్ వైడ్ రూ. 89 కోట్ల బిజినెస్ చేసిన వీరయ్య.. దాదాపు రూ. 140 కోట్లకు పైగా షేర్ సాధించి బ్లాక్ బస్టర్ గా నిలిచింది.దాంతో ప్రతీ పెద్ద బ్యానర్, ప్రతీ పెద్ద హీరో ..బాబీతో సినిమా చెయ్యాలని ఉత్సాహం చూపిస్తోంది. అయితే బాబితో చేయటానికి ఏ హీరో ఓకే చేసారు. ఏ బ్యానర్ ప్రొడ్యూస్ చేస్తోంది. 

మీడియా వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు ... బాబి తో బాలయ్య సినిమా చేయబోతున్నారు. సితార బ్యానర్ ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేస్తోంది. అదేంటి మైత్రీ బ్యానర్ కదా ఈ సినిమా చేయాల్సింది. హ్యాండ్ ఇచ్చాడా అని ఫిల్మ్ సర్కిల్స్ లో వినిపిస్తోంది. అయితే హ్యాండ్, లెగ్ ఇవ్వటం కాదు. బాబీ ఓ కండీషన్ పెట్టాడు. అది నెరవేర్చిన సితార బ్యానర్ తో ముందుకు వెళ్తున్నాడు అంటున్నారు. ఆ కండీషన్ ఏమిటి అంటే...ఇప్పుడున్న పరిస్దితుల్లో స్టార్ హీరోలు డేట్స్ ఎవరివీ ఖాళీ లేవు. అందరూ వరస ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. ఈ క్రమంలో తనకు ఏ బ్యానర్ అయితే స్టార్ ని తీసుకొచ్చి సెట్ చేస్తుందో వాళ్ళతో ముందుకు వెళ్దామని ఫిక్స్ అయ్యారట. ఈ ప్రాసెస్ లో భాగంగానే వేర్వేరు హీరోలను కలిసి స్టోరీ లైన్ చెప్పారని, చివరకు బాలయ్య సెట్ అయ్యడని అంటున్నారు. మైత్రీ వాళ్లు ఆ పని చెయ్యాలేదని చెప్తున్నారు. మరో ప్రక్క వెంకీ మామ‌  తరువాత పీపుల్స్ మీడియాకు మరో సినిమా చేస్తాననే మాట బాబీ ఇచ్చారని.. ఆ మాటలు కూడా జరుగుతున్నాయని అంటున్నారు.

ఈ వార్త నిజమైతే బాబీ బాలయ్య కాంబినేషన్ బాక్సాఫీస్ ను ఏ రేంజ్ లో షేక్ చేస్తుందో చూడాలి. రొటీన్ కథ అయినా జనరంజకంగా చెప్పగలరు బాబి అనే పేరు ఉంది. అది నిజం అవుతుంది. మరో ప్రక్క బాలయ్య ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన ప్రాజెక్ట్ లను పూర్తి చేస్తే మాత్రమే కొత్త ప్రాజెక్ట్ లకు సంబంధించిన ప్రకటనలు వెలువడే ఛాన్స్ అయితే ఉంటుంది. బాలయ్య రెమ్యునరేషన్ 20 కోట్ల రూపాయల నుంచి 25 కోట్ల రూపాయల రేంజ్ లో ఉండగా వరుస ప్రాజెక్ట్ లతో బాలయ్య కెరీర్ పరంగా బిజీగా ఉన్నారు.

PREV
click me!

Recommended Stories

Sivakarthikeyan: కారు ప్రమాదం నుంచి తప్పించుకున్న శివకార్తికేయన్, నడిరోడ్డుపై గొడవ సెటిల్ చేసిన హీరో
Ashika Ranganath: దాదాపు 30 ఏళ్ళ వయసు తేడా ఉన్న ముగ్గురు హీరోలతో రొమాన్స్.. హీరోయిన్ రియాక్షన్ వైరల్