‘టైటానిక్’, ‘అవతార్’ చిత్రాల నిర్మాత‌ మృతి

By Surya PrakashFirst Published Jul 8, 2024, 7:30 AM IST
Highlights

. రెండు దశాబ్దాలుగా ఆయన నిర్మించిన చిత్రాలే కాదు.. జాన్‌ వ్యక్తిత్వం, సినిమాల పట్ల ఉన్న అంకితభావం చాలా ప్రత్యేకమైనవి’’ అంటూ ప్రముఖ దర్శకుడు జేమ్స్‌ కామెరూన్‌ సంతాపం వ్యక్తం చేశారు.
 

ప్రపంచ వ్యాప్తంగా సెన్సేషన్ సృష్టించిన  ‘టైటానిక్’, ‘అవతార్’ చిత్రాల నిర్మాత  జాన్ లాండౌ మృతిచెందారు. ఈ విష‌యాన్ని ఆయ‌న కుటుంబ స‌భ్యులు సోష‌ల్ మీడియా వేదికగా వెల్ల‌డించారు. ఇక ఆయ‌న మృతిప‌ట్ల దిగ్గ‌జ‌ ద‌ర్శ‌కుడు జేమ్స్ కామెరాన్, సామ్ వ‌ర్తింగ్స్‌ట‌న్ త‌దిత‌రులు సంతాపం ప్ర‌క‌టించారు.

కొంతకాలంగా క్యాన్సర్‌తో బాధపడుతున్న ఆయన.. చికిత్స తీసుకుంటూ మరణించినట్లు కుటుంబ సభ్యులు సోషల్ మీడియా ద్వారా తెలియచేసారు. ఇప్పటివరకు ఎనిమిది చిత్రాలకు నిర్మాతగా వ్యవహరించిన జాన్‌కి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. ‘‘జాన్‌ లాండౌ.. 31ఏళ్లుగా నా ప్రియమైన స్నేహితుడు. ఆయన లేకపోవడం నాలో కొంతభాగాన్ని కోల్పోయినట్టుగా ఉంది. రెండు దశాబ్దాలుగా ఆయన నిర్మించిన చిత్రాలే కాదు.. జాన్‌ వ్యక్తిత్వం, సినిమాల పట్ల ఉన్న అంకితభావం చాలా ప్రత్యేకమైనవి’’ అంటూ ప్రముఖ దర్శకుడు జేమ్స్‌ కామెరూన్‌ సంతాపం వ్యక్తం చేశారు.

Latest Videos

1980లో ప్రొడక్షన్ మేనేజర్​గా కెరీర్ ప్రారంభించిన జాన్ టైటానిక్ సినిమాతో ప్ర‌త్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈ సినిమాను 1997లో నిర్మించిన ఆయ‌న అప్ప‌ట్లోనే ఈ చిత్రం కోసం 200 మిలియ‌న్ల బ‌డ్జెట్‌ను పెట్టగా.. సూమారు రూ.500 కోట్ల‌కు పైగా వ‌సూళ్ల‌ను రాబ‌ట్టింది. ఈ చిత్రానికి క‌లెక్ష‌న్స్ మాత్ర‌మే కాకుండా 11 ఆస్కార్ అవార్డులు ద‌క్కించుకుంది. ఇప్ప‌టివ‌ర‌కు అత్య‌ధిక ఆస్కార్ అవార్డులు అందుకున్న చిత్రాల‌లో టైటానిక్ రెండో స్థానంలో నిలిచింది.
 

click me!