`టిల్లు స్వ్కేర్‌` రెండు రోజుల కలెక్షన్లు.. బాక్సాఫీసు వద్ద రచ్చ.. అనూహ్యంగా తెరపైకి `టిల్లు3`

Published : Mar 31, 2024, 12:09 PM IST
`టిల్లు స్వ్కేర్‌` రెండు రోజుల కలెక్షన్లు.. బాక్సాఫీసు వద్ద రచ్చ.. అనూహ్యంగా తెరపైకి `టిల్లు3`

సారాంశం

సిద్దు, అనుపమా పరమేశ్వరన్‌ జంటగా నటించిన `టిల్లు స్వ్కేర్‌` మూవీ థియేటర్లలో రచ్చ చేస్తుంది. కలెక్షన్లు భారీగా వస్తున్నాయి. అయితే మూడో సీక్వెల్‌ని కూడా ప్రకటించింది టీమ్‌.   

`టిల్లు స్వ్కేర్‌` మూవీ ప్రస్తుతం బాక్సాఫీసు వద్ద దుమ్మురేపుతుంది. కలెక్షన్లు బీభత్సంగా వస్తున్నాయి. నిర్మాతలు ఊహించిన దానికంటే ఎక్కువగానే ఈ మూవీకి స్పందన రావడం విశేషం. మొదటి రోజు ఊహించినట్టే 23కోట్ల గ్రాస్‌ వసూలు చేసింది. ఇక రెండో రోజు కూడా దుమ్మురేపింది. మరో 22 కోట్లు యాడ్‌ అయ్యాయి. రెండు రోజుల్లోనే `టిల్లుస్వ్కేర్‌` ఏకంగా 45కోట్లు(45.3) వసూలు చేయడం విశేషం. అంటే ఆల్మోస్‌ 20కోట్ల షేర్‌ వచ్చింది. ఈ మూవీ థియేట్రికల్‌ బిజినెస్ 25కోట్లు. కాగా రెండు రోజుల్లోనే 90శాతం రికవరీ వచ్చేసింది.

మరో పది కోట్ల గ్రాస్‌ వస్తే సినిమా అన్ని చోట్ల బ్రేక్‌ ఈవెన్‌ అవుతుంది. అయితే ఆదివారం ఈ మూవీకి కలిసి వచ్చే అవకాశం ఉంది. గత రెండు రోజులకంటే మూడో రోజు కలెక్షన్లు పెరిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. మరో ఇరవై కోట్లకుపైగా గ్రాస్‌ వచ్చే అవకాశం ఉంది. దీంతో మూడో రోజుతోనే సినిమా లాభాల్లోకి వెళ్తుందని చెప్పొచ్చు. అంతేకాదో ఓవర్సీస్‌లోనే ఈ చిత్రానికి 14 కోట్ల(గ్రాస్‌) వరకు కలెక్షన్లు రావడం ఆశ్చర్యంగా మారింది. ఓవర్సీస్‌లో ఈ మూవీకి విశేష స్పందన లభిస్తుంది.

 అలాగే నైజాంలో దుమ్మురేపుతుంది. హైదరాబాద్‌ ప్రధానంగా సినిమా సాగడం, ఇందులో హీరో టిల్లు హైదరాబాద్‌ లాంగ్వేజ్‌ వాడటం అది ఆడియెన్స్ కి బాగా కనెక్ట్ అయ్యింది. అందుకే ఇక్కడ రచ్చ చేస్తుంది `టిల్లు స్వ్కేర్‌`. ఈ సినిమా నైజాం రైట్స్ ని నిర్మాత దిల్‌ రాజు ఏడుకోట్లకి కొన్నాడు. ఇప్పుడు రెండు రోజుల్లోనే ఏడో కోట్లకుపైగా షేర్‌ వచ్చేసింది. బ్రేక్‌ ఈవెన్ దాటేసింది. ఇక ఆదివారం నుంచి వచ్చేదంతా లాభాలే అని చెప్పొచ్చు. ఇక్కడ ఈజీగా 15-20కోట్ల షేర్‌ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. `గుంటూరు కారం`లో బాగా నష్టపోయిన దిల్‌రాజుకి `టిల్లు స్వ్కేర్‌` బ్యాలెన్స్ చేస్తుందని చెప్పొచ్చు. 

ఇక సిద్దు జొన్నలగడ్డ, అనుపమా పరమేశ్వరన్‌ జంటగా నటించిన `టిల్లు స్వ్కేర్‌`కి మల్లిక్‌ రామ్‌ దర్శకత్వం వహించారు. నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించారు. `డీజే టిల్లు` పెద్ద హిట్‌ కావడంతో దీనికి సీక్వెల్‌ తీసుకొచ్చారు. శుక్రవారం విడుదలైన ఈ మూవీ ఫస్ట్ షో నుంచి పాజిటివ్‌ టాక్‌ తెచ్చుకుంది. ఇప్పుడు కలెక్షన్లు దుమారం రేపుతుంది. ఇదిలా ఉంటే ఇటీవల మీడియాతో మాట్లాడుతూ, నిర్మాత నాగవంశీ దీనికి మూడో సీక్వెల్ ఉంటుందని ప్రకటించారు. `టిల్లు3`(టిల్లు క్యూబ్‌)గా దీన్ని తీసుకొస్తామన్నారు. అయితే ఇప్పుడు థియేటర్లలో దాన్ని యాడ్‌ చేశారట. `టిల్లు3` అనే ఎండ్‌ కార్డ్ లో వేసినట్టు తెలుస్తుంది. దీంతో మరోసారి టిల్లుగాడి రచ్చ ఉండబోతుందని చెప్పొచ్చు. 
 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

అల్లు అర్జున్ కొంప ముంచిన అల్లు అరవింద్, కెరీర్ లో బిగ్గెస్ట్ డిజాస్టర్..పండగ చేసుకున్న స్టార్ హీరో కొడుకు
Duvvada Srinivas: చీరలమ్మి 7 నెలల్లో 12 కోట్లు సంపాదించా, సక్సెస్ అంటే ఇది