'మీరు ఇంకా వర్జినా'.. అభిమాని ప్రశ్నకు రెచ్చిపోయిన స్టార్ హీరో!

Published : Aug 12, 2019, 05:29 PM ISTUpdated : Aug 13, 2019, 11:38 AM IST
'మీరు ఇంకా వర్జినా'.. అభిమాని ప్రశ్నకు రెచ్చిపోయిన స్టార్ హీరో!

సారాంశం

పలువురు సినీ తారలు అభిమానులకు చేరువగా ఉండేదుకు సోషల్ మీడియాని ఉపయోగించుకుంటుంటారు. కానీ కొన్ని సార్లు సోషల్ మీడియా వల్లే తారలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. బాలీవుడ్ లో ప్రేమ వ్యవహారాలు చాలా సాధారణం. స్టార్ హీరోలు, హీరోయిన్ల మధ్య ప్రేమకు సంబంధించిన వార్తలు నిత్యం చూస్తూనే ఉన్నాము.   

అలా బాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారిన జంట టైగర్ ష్రాఫ్, దిశా పటాని. బాగి 2లో వీరిద్దరూ రొమాన్స్ చేశారు. ప్రస్తుతం చెట్టాపట్టాలేసుకుని తిరుగుతూ ప్రేమలో మునిగితేలుతున్నారు. ఇదిలా ఉండగా టైగర్ ష్రాఫ్ అభిమానులతో ముచ్చటించేందుకు 'ఆస్క్ మి ఎనీథింగ్' అనే కార్యక్రమాన్ని ప్రారంభించాడు. 

అభిమానులంతా సరదాగా టైగర్ తో ముచ్చటిస్తున్న సమయంలో ఓ ఆకతాయి అభిమాని మాత్రం అసభ్యకరంగా ప్రశ్నించాడు. 'మీరు ఇప్పటికి వర్జీనేనా' అని ప్రశ్నించడంతో టైగర్ కు చిర్రెత్తుకొచ్చింది. సిగ్గులేని వెధవ అంటూ ఆ అభిమానిపై విరుచుకుపడ్డాడు. 

నన్ను మా కుటుంబ సభ్యులు కూడా ఫాలో అవుతున్నారు. ఇలాంటి ప్రశ్నలేనా అడిగేది అని సదరు నెటిజన్ కు బుద్ది చెప్పాడు. ఇక టైగర్ కు దిశా పటాని తో లవ్ ఎఫైర్ కు సంబంధించిన ప్రశ్నలు కూడా అభిమానుల నుంచి ఎదురయ్యాయి. మీకు ఎంతమంది గర్ల్ ఫ్రెండ్స్ అని ప్రశ్నించగా.. ఎవరూ లేరు అని సమాధానం ఇచ్చాడు. 

మీరు దిశాతో డేటింగ్ లో ఉన్నారా అని ప్రశ్నించగా.. ఆమెతో డేటింగా.. నాకు అంత సీన్ లేదు అని బదులిచ్చాడు. దిశా గురించి మాట్లాడడానికి టైగర్ తప్పించుకుంటున్నా.. దిశా మాత్రం పలు సందర్భాల్లో టైగర్ తో తనకున్న రిలేషన్ ని ప్రస్తావించింది. టైగర్ ని ఇంప్రెస్ చేయడానికి ప్రయత్నిస్తున్నా అని పలు ఇంటర్వ్యూలలో తెలిపింది. 

PREV
click me!

Recommended Stories

Ustaad Bhagat Singh: ఊపేసేలా ఉన్న `దేఖ్‌ లేంగే సాలా` పాట.. మళ్లీ ఆ రోజులను గుర్తు చేసిన పవన్‌ కళ్యాణ్‌
అడివి శేష్ గూఢచారి 2 తో పాటు బోల్డ్ హీరోయిన్ నుంచి రాబోతున్న 5 సినిమాలు ఇవే