`టైగర్‌ నాగేశ్వర రావు` టీజర్‌ అప్‌డేట్.. రవితేజ పులి దాడి చేసేది అప్పుడే..

Published : Aug 12, 2023, 04:35 PM IST
`టైగర్‌ నాగేశ్వర రావు` టీజర్‌ అప్‌డేట్.. రవితేజ పులి దాడి చేసేది అప్పుడే..

సారాంశం

`టైగర్‌ నాగేశ్వరరావు` చిత్రం నుంచి ఇప్పటికే ఫస్ట్ లుక్‌, గ్లింప్స్ విడుదలయ్యాయి. మరో అప్‌డేట్‌ ఇచ్చేందుకు రెడీ అవుతుంది యూనిట్‌. ఈ సినిమా టీజర్‌ని విడుదల చేయబోతున్నారు. 

మాస్‌ మహారాజా రవితేజ (Raviteja)హీరోగా నటిస్తున్న భారీ మూవీ `టైగర్‌ నాగేశ్వరరావు`(Tiger Nageswara Rao). ఆయన నటిస్తున్న తొలి పాన్‌ ఇండియా మూవీ ఇది. వంశీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం టైగర్ నాగేశ్వరరావు అనే బందిపోటు జీవిత కథతో రూపొందుతుంది. పీరియాడికల్‌గా దీన్ని తెరకెక్కిస్తున్నారు. అభిషేక్‌అగర్వాల్‌ ఆర్ట్స్ పతాకంపై అభిషేక్‌ అగర్వాల్‌ నిర్మిస్తున్నారు. ఈ చిత్రం నుంచి ఇప్పటికే ఫస్ట్ లుక్‌, గ్లింప్స్ విడుదలయ్యాయి. మరో అప్‌డేట్‌ ఇచ్చేందుకు రెడీ అవుతుంది యూనిట్‌. ఈ సినిమా టీజర్‌ని విడుదల చేయబోతున్నారు. 

ఆగస్ట్ 17న గురువారం `టైగర్‌ నాగేశ్వరరావు` టీజర్‌ని విడుదల చేయబోతున్నారు. తాజాగా శనివారం ఈ విషయాన్ని ప్రకటించింది. స్వాతంత్ర్య దినోత్సవ కానుకగా ఈ సర్‌ప్రైజ్‌ ఉంటుందని భావించారు. కానీ రెండు రోజులు ఆలస్యంగా టీజర్‌ని విడుదల చేయబోతున్నారు. టైగర్ దాడి అప్పుడే అంటూ చిత్ర బృందం ఈ అప్‌డేట్‌ని ఇచ్చింది. ప్రస్తుతం ఇది నెట్టింట వైరల్ అవుతుంది. దీనికి సంబంధించిన ఓ కొత్త పోస్టర్‌ ని విడుదల చేశారు. ఇందులో రవితేజ కాళ్లు కట్టేసినట్టు ఉంది. ఆయన యాక్షన్‌లోకి దిగబోతున్నట్టు తెలుస్తుంది. టీజర్ కూడా నెక్ట్స్ లెవల్‌లో ఉండబోతుందని టాక్. 

ఇక వంశీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాని భారీ బడ్జెట్ తో నిర్మాత అభిషేక్‌ అగర్వాల్ నిర్మిస్తున్నారు. ఇప్పటి వరకు రవితేజ కెరీర్‌లోనే అత్యధిక బడ్జెట్‌తో రూపొందుతున్న సినిమా కావడం ఓ విశేషమైతే, ఆయన తొలి పాన్‌ ఇండియా మూవీ కావడం మరో విశేషం. ఇక అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని దసరా కానుకగా అక్టోబర్‌ 20న ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు. దీంతో ఇక నెమ్మదిగా ప్రమోషన్స్ జోరు పెంచుతున్నారు. ఈ సినిమాలో రవితేజ సరసన `నూపూర్‌ సనన్, గాయత్రి భరద్వాజ్‌ కథానాయికలుగా నటిస్తున్నారు. 

ఇక రవితేజ చివరగా `రావణాసుర` చిత్రంలో నటించాడు. ఇది పెద్ద డిజాస్టర్‌ అయ్యింది. సుశాంత్‌, మేఘా ఆకాష్‌, ఫరియా అబ్దుల్లా వంటి వారు నటించినా ఫలితం లేదు. సుధీర్‌ వర్మ రూపొందించిన ఈచిత్రం బిగ్గెస్ట్ డిజాస్టర్లలో ఒకటి అయ్యింది. అంతకు ముందు మాస్‌ రాజా `ధమాఖా`తో బ్లాక్‌ బస్టర్‌ని అందుకున్న విషయం తెలిసిందే. 
 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

Krishnam Raju: చిరంజీవి ఇలా మనసు పడ్డాడో లేదో, మెడలో ఖరీదైన గిఫ్ట్ పెట్టిన కృష్ణంరాజు.. మర్చిపోలేని బర్త్ డే
మడత మంచం పై పడుకొని, ప్రకృతిని ఆస్వాదిస్తున్న అనసూయ