
కింగ్ ఖాన్ షారుఖ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'జవాన్'. పఠాన్ పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ కావడంతో జవాన్ చిత్రంపై అంచనాలు తారాస్థాయికి చేరాయి. పైగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తోంది సౌత్ డైరెక్టర్ అట్లీ. దీనితో సౌత్ లో కూడా ఈ చిత్రానికి ఆల్రెడీ క్రేజ్ వచ్చేసింది. సెప్టెంబర్ 7న జవాన్ గ్రాండ్ రిలీజ్ కి రెడీ అవుతోంది. దీనితో నెమ్మదిగా ప్రచార కార్యక్రమాలు ఊపందుకుంటున్నాయి.
జవాన్ చిత్రంలో షారుఖ్ కి జోడిగా సౌత్ లేడీ సూపర్ స్టార్ నయనతార నటిస్తోంది. తాజాగా షారుఖ్ సోషల్ మీడియాలో అభిమానులతో AskSRK పేరుతో చాట్ సెషన్ నిర్వహించాడు. అభిమానులు అడిగిన ప్రశ్నలకు సరదాగా సమాధానాలు ఇచ్చాడు. జవాన్ చిత్రంలో సందేశం ఉంటుందా అని ఓ అభిమాని ప్రశ్నించగా.. మహిళల సాధికారత గురించి చెప్పే చిత్రం ఇది. మహిళల్ని ఎలా గౌరవించాలి.. వాళ్ళకి ఎలాంటి ప్రోత్సాహం ఇవ్వాలి అనేది ఈ చిత్రంలో చూపించాం అని షారుఖ్ అన్నారు.
మరో నెటిజన్ కాస్త కొంటెగా ప్రశ్న సంధించాడు. ఈ చిత్రంలో మీ రొమాంటిక్ యాంగిల్ చూడొచ్చా అని అడగా.. ఒక్క వైపు మాత్రమే కాదు.. ఫ్రంట్, బ్యాంకు, సైడు అన్ని కోణాల్లో చూడొచ్చు అంటూ షారుఖ్ చెప్పిన సమాధానం వైరల్ అవుతోంది. మరో నెటిజన్ కాస్త ఆకతాయిగా.. మీరు నయనతారకి పడిపోయారా ? ఆమెకి ప్రేమిస్తున్నారా అని ప్రశ్నించాడు.
దీనితో షారుఖ్ కూడా అంతే ఘాటుగా బదులిచ్చాడు. నోరు మూయండి.. ఆమె ఇద్దరు పిల్లలకు తల్లి అంటూ షారుఖ్ ఘాటైన సమాధానం ఇచ్చాడు. షారుఖ్ నెటిజన్ కి ఇచ్చిన ఈ రిప్లై నెట్టింట వైరల్ గా మారింది.