30 Weds 21 Fame Chaitanya : హీరోగా మారనున్న ‘30 వెడ్స్ 21’ఫేమ్ చైతన్య.. త్వరలోనే షూటింగ్

Published : Mar 09, 2022, 03:11 PM ISTUpdated : Mar 09, 2022, 03:13 PM IST
30 Weds 21 Fame Chaitanya : హీరోగా మారనున్న ‘30 వెడ్స్ 21’ఫేమ్ చైతన్య.. త్వరలోనే షూటింగ్

సారాంశం

‘30 వెడ్స్ 21’ వెబ్ సిరీస్ తో పాపులర్ అయిన చైతన్య రావు (Chaitanya Rao) హీరోగా మారనున్నాడు. బిగ్ స్క్రీన్ పై తెలుగు ఆడియెన్స్ ను అలరించనున్నాడు. చైతన్య హీరోగా ఓ థ్రిల్లర్ మూవీ రాబోతుంది. త్వరలో షూటింగ్ కూడా ప్రారంభం కానుంది. 

గతేడాది య్యూటూబ్ ను షేక్ చేసిన వెబ్ సిరీస్ లలో ‘30 వెడ్స్ 21’ ఒకటి.  ఈ తెలుగు వెబ్ సిరీస్ య్యూటూబ్ లో ఒక రకంగా సెన్సేషన్ క్రియేట్ చేసిందనే చెప్పాలి. ప్రేక్షకులు ఈ సిరీస్ ఎపిసోడ్స్ ను మిలియన్ల వ్యూస్ తో విజయవంతం చేయడం విశేషం.  చాయ్ బిస్కెట్  (Chai Bisket) సంస్థ రూపొందించిన ఈ వెబ్ సిరీస్ యువతలో బాగా పాపులర్ అయింది. 30 ఏళ్ల వయసున్న ఐటీ జాబ్ చేసే వ్యక్తి.. 21 ఏళ్ల వయసున్న అందాల యువతని పెళ్లి చేసుకుంటే వారిద్దరి మ్యారేజ్ లైఫ్ ఎలా మొదలయింది అనే కథాంశంతో ఈ వెబ్ సిరీస్ రూపొందించారు. చైతన్య రావు, అనన్య జంటగా నటించారు. ఇద్దరి మధ్య బ్రీజీ రొమాన్స్ కు యువత ఫిదా అయ్యారు. 

ఫస్ట్ సీజన్ కు మంచి రెస్పాన్స్ రావడంతో ప్రస్తుతం సెకండ్ సీజన్ ను కూడా రిలీజ్ చేస్తున్నారు. రెండో సీజన్స్ లోనూ నాలుగు ఎపిసోడ్స్ రిలీజ్ కాగా.. మిలియన్ల వ్యూస్ ను సొంతం చేసుకుందీ వెబ్ సిరీస్. అయితే ఈ వెబ్ సిరీస్ తో చైతన్య రావుకు మంచి గుర్తింపు వచ్చింది. యూత్, ఆడియెన్స్ లో క్రేజ్ కూడా పెరిగింది. ఆ ఫేమ్‌తో హీరోగా మారనున్నాడు  చైతన్య. నిజానికి ఇది చైతన్యకు బంపర్ ఆఫర్ అని చెప్పాలి. బుల్లితెరపై అలరించిన చైతన్య బిగ్ స్క్రీన్ పై ఎలా ఆకట్టుకోనున్నాడో వేచి చూడాల్సిందే..

 

పెళ్లి చూపులు, దొరసాని వంటి పలు హిట్ చిత్రాలను నిర్మించిన బిగ్‌బెన్‌ సినిమాస్ పతాకంపై ఓ థ్రిల్లర్ అండ్ ఫ్యామిలీ ఎంటర్ టైరన్ రాబోతోంది. ఈ మూవీలోనే చైతన్య రావును హీరోగా ఆడియెన్స్ ను అలరించనున్నాడు. నిర్మాత యశ్  రంగినేని చిత్రాన్ని నిర్మిస్తుండగా 'పిట్ట కథ' మూవీ డైరెక్టర్‌ చెందు ముద్దు దర్శకత్వం వహిస్తున్నారు. త్వరలోనే ఈ మూవీ సెట్స్ పైకి వెళ్లనుంది. ఇదే విషయాన్ని బిగ్ బెన్ సినిమాస్ ట్విట్టర్ ఖాతాలో అఫిషియల్ అనౌన్స్ చేసింది. సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలను త్వరలో  వెల్లడించనున్నట్టు తెలిపారు.

PREV
click me!

Recommended Stories

Prabhas in Japan: జపాన్ లో భూకంపం నుంచి ప్రభాస్ సేఫ్.. హమ్మయ్య, రెబల్ స్టార్ కి గండం తప్పింది
8 సినిమాలు చేస్తే 6 ఫ్లాపులు, స్టార్ హీరోయిన్ గా ఉండాల్సిన నటి ఇలా.. తనని టార్గెట్ చేయడంపై ఎమోషనల్