Prabhas-Krishnamraju: ప్రభాస్ పెదనాన్న కృష్ణంరాజుకు ప్రమాదం... శస్త్రచికిత్స చేసిన వైద్యులు!

Published : Mar 09, 2022, 01:05 PM IST
Prabhas-Krishnamraju: ప్రభాస్ పెదనాన్న కృష్ణంరాజుకు ప్రమాదం... శస్త్రచికిత్స చేసిన వైద్యులు!

సారాంశం

కొన్నిరోజులుగా సీనియర్ నటుడు కృష్ణంరాజు ఆరోగ్యంపై పలు కథనాలు చక్కర్లు కొడుతున్నాయి. తాజా సమాచారం ప్రకారం ఆయన కాలికి ఆపరేషన్ జరిగిందట. ప్రస్తుతం ఈ న్యూస్ టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా వైరల్ అవుతుంది.


ప్రభాస్‌ పెదనాన్న కృష్ణంరాజు (Krishnamraju)చిన్న ప్రమాదానికి గురయ్యారట. నివాసంలో ఆయన ప్రమాదవశాత్తు  కాలు జారి కింద పడిపోయారట. ఈ ప్రమాదంలో ఆయన కాలికి బలమైన గాయమైనట్లు సమాచారం. దీంతో ఆయనకు ఆపరేషన్‌ జరిగిందని ఇండస్ట్రీలో వర్గాల్లో గట్టిగా వినిపిస్తుంది. సర్జరీలో భాగంగా ఆయన కాలి వేలుని తొలగించారనేది వినిపిస్తున్న టాక్.  ఫ్యాన్స్‌ కంగారు పడే అవకాశం ఉందని... ఆయనకు జరిగిన ప్రమాదం, ఆపరేషన్ గురించి గోప్యంగా ఉంచినట్లు సమాచారం.కానీ విశ్వసనీయ వర్గాల ద్వారా బయటికి పొక్కిందట. అయితే కంగారు పడాల్సిన అవసరం లేదని, ఆయన పూర్తి ఆరోగ్యంగా ఉన్నట్లు సమాచారం. 

 ఇక గాయం నుండి ఆయన కృష్ణంరాజు కోలుకుంటున్నారట. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో కృష్ణంరాజు సతీమణి శ్యామలాదేవి మాట్లాడుతూ.. ఆయన ఇంట్లో జారిపడ్డారని చెప్పారు. అభిమానులకు ఇబ్బంది కలిగించొద్దనే ఉద్దేశ్యంతోనే ఈ విషయాన్ని చెప్పలేదట. ఆపరేషన్‌ కారణంగానే ‘రాధేశ్యామ్‌’ప్రమోషన్స్‌లో ఆయన పాల్గొనలేకపోయాడట. మూవీ విడుదల తర్వాత ఆయన మీడియా ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. 

ప్రభాస్‌ (Prabhas)హీరోగా నటించిన రాధేశ్యామ్‌ చిత్రం ఈ నెల 11న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ మూవీలో కృష్ణంరాజు కూడా ఓ రోల్ చేస్తున్నారు. ఆయన పరమహంస అనే స్వామీజీ పాత్ర చేస్తున్నారు. చాలా కాలం తర్వాత ప్రభాస్ మూవీలో కృష్ణంరాజు నటిస్తున్నారు. బిల్లా, రెబల్ చిత్రాల్లో కృష్ణంరాజు నటించారు. 

కాగా రాధే శ్యామ్(Radhe Shyam) మూవీపై భారీ అంచనాలున్నాయి. వరల్డ్ వైడ్ గా భారీ ఎత్తున విడుదలవుతున్న రాధే శ్యామ్ రికార్డు ఓపెనింగ్స్ రాబట్టనుంది. అడ్వాన్స్ బుకింగ్స్ రూపంలోనే భారీగా కలెక్షన్స్ రాబడుతుంది. దర్శకుడు రాధాకృష్ణ ఎమోషనల్ లవ్ ఎంటర్టైనర్ గా రాధే శ్యామ్ తెరకెక్కించారు. పూజా హెగ్డే ప్రభాస్ కి జంటగా నటించారు. 

PREV
click me!

Recommended Stories

Sara Arjun: ధురంధర్ స్టార్ సారా అర్జున్ రూ.12 కోట్ల లగ్జరీ ఫ్లాట్.. వైరల్ ఫోటోలు
Top 10 Movies 2025: పవన్, వెంకటేష్, రాంచరణ్ లలో బాక్సాఫీస్ వద్ద ఎవరి సత్తా ఎంత ? 2025లో టాప్ 10 మూవీస్ ఇవే