పేరు మార్చుకున్న పవన్ కళ్యాణ్, పేరెంట్స్ పెట్టిన రియల్ నేమ్ ఏంటో తెలుసా?

Published : Dec 28, 2024, 09:07 AM ISTUpdated : Dec 28, 2024, 09:08 AM IST
పేరు మార్చుకున్న పవన్ కళ్యాణ్, పేరెంట్స్ పెట్టిన రియల్ నేమ్ ఏంటో తెలుసా?

సారాంశం

పవన్ కళ్యాణ్ తన పేరు మార్చుకున్నాడట. తల్లిదండ్రులు పెట్టిన పేరు అది కాదట. ఈ విషయాన్ని తల్లి అంజనా దేవి స్వయంగా వెల్లడించారు.   

పవన్ కళ్యాణ్ అనే పేరుకు ఓ బ్రాండ్ వాల్యూ ఉంది. అభిమానులు ఈ పేరు వింటే చొక్కాలు చించుకుంటారు. బహుశా పవన్ కళ్యాణ్ కి మాదిరి  డై హార్డ్ ఫ్యాన్స్, మరొక హీరోకి ఉండరేమో.  చిరంజీవి నట వారసుడిగా ఎంట్రీ ఇచ్చిన పవన్ కళ్యాణ్ టాలీవుడ్ టాప్ హీరోల్లో ఒకరిగా ఎదిగాడు. 
పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఆయన్ని పవర్ స్టార్ అని పిలుచుకుంటారు. అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి పవన్ కళ్యాణ్ డెబ్యూ మూవీ. ఈ చిత్రంలో రియల్ స్టంట్స్ చేసి పవన్ కళ్యాణ్ తెలుగు ఆడియన్స్ కి కొత్త అనుభూతిని పంచాడు. సుస్వాగతం, తొలిప్రేమ, తమ్ముడు, బద్రి వంటి విజయాలు పవన్ కళ్యాణ్ కి స్టార్డం తెచ్చిపెట్టాయి. 

2001లో విడుదలైన ఖుషి పవన్ కళ్యాణ్ ఇమేజ్ మరో స్థాయికి తీసుకెళ్లింది. యూత్ పవన్ కళ్యాణ్ కి బాగా అట్రాక్ట్ అయ్యారు. ఖుషి అనంతరం పవన్ కళ్యాణ్ కి వరుస పరాజయాలు ఎదురయ్యాయి. కానీ పవన్ కళ్యాణ్ ఇమేజ్ కొంచమైనా తగ్గలేదు. జల్సా, గబ్బర్ సింగ్, అత్తారింటికి దారేది పవన్ కళ్యాణ్ కి మంచి విజయాలు అందించాయి. ఆయన తిరిగి ట్రాక్ లో పడ్డాడు. 

కాగా పవన్ కళ్యాణ్ అసలు పేరు వేరట. ఈ విషయాన్ని తల్లి అంజనా దేవి స్వయంగా వెల్లడించింది. అంజనాదేవి గతంలో ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. పవన్ కళ్యాణ్ కి సంబంధించిన అనేక ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. పవన్ కళ్యాణ్ అన్నప్రాసన రోజు కత్తి పట్టుకున్నాడట. తండ్రి వెంకట్రావు దగ్గర ఒక కత్తి ఉండేదట. 

పెన్ను, పుస్తకం, డబ్బు, నగలతో పాటు కత్తి కూడా పవన్ కళ్యాణ్ ముందు ఉంచారట. పవన్ కళ్యాణ్ కత్తి పట్టుకున్నాడట. కత్తి పట్టుకున్నాడంటే వీడు పెద్దయ్యాక కోపిష్టి అయినా అవుతాడు, లేదంటే ప్రజలకు మేలు చేసేవాడు అవుతాడని.. అంజనాదేవి భావించిందట. చిన్నప్పటి నుండి పవన్ కళ్యాణ్ కి పుస్తకాలు చదవడం అంటే ఇష్టం. ఎక్కువగా లైబ్రరీలో గడిపేవాడు. ఇప్పటికీ తన గదిలో చాలా పుస్తకాలు ఉంటాయట. 

ఈ పుస్తకాలు చదివే అలవాటు తండ్రి నుండి వచ్చిందని అంజనాదేవి అన్నారు. పవన్ కళ్యాణ్ అసలు పేరు ఏంటి? బారసాలలో పెట్టిన పేరు అదేనా? అని యాంకర్ అంజనాదేవిని అడిగింది. కాదని ఆమె సమాధానం చెప్పారు. మేము శ్రీ కళ్యాణ్ కుమార్ అని పెట్టాము. ఎవరో పవన్ అని పెట్టారట. అలా పవన్ కళ్యాణ్ గా స్థిరపడిపోయింది... అని అంజనాదేవి అన్నారు.  కాగా చిరంజీవి కూడా స్క్రీన్ నేమ్ మార్చుకున్న సంగతి తెలిసిందే. చిరంజీవి అసలు పేరు శివశంకర వరప్రసాద్. స్క్రీన్ నేమ్ అనేది కొత్తగా, స్టైలిష్ గా ఉండాలి. ఇతర నటుల పేర్లతో పోలిక ఉండకూడదని చిరంజీవి భావించారట. అప్పుడు చిరంజీవికి ఓ కల వచ్చిందట. ఆ కలలో గర్భగుడి ఎదుట ఆయన  పడుకుని ఉన్నాడట. 

ఓ పాప వచ్చి... చిరంజీవి ఏంటి ఇక్కడ పడుకున్నావ్? వెళ్లి నీ పని చూసుకో అందట. తన ఫ్రెండ్ కూడా వచ్చి చిరంజీవి రా వెళదాం, అన్నాడట. వీళ్లు చిరంజీవి అని పిలుస్తున్నారేంటని ఆయన అనుకున్నారట. కలలో నుండి ఉలిక్కి పడి లేచిన ఆయన... ఈ విషయం తల్లితో చెప్పాడట. అప్పటి వరకు అలాంటి పేరు ఒకటి ఉంటుందని, అది తనకు ఇష్టమైన ఆంజనేయ స్వామి పేరని చిరంజీవికి తెలియదట. 

చిరంజీవి స్క్రీన్ నేమ్ గా ఎందుకు పెట్టుకోకూడదని ఆయన అనుకున్నారట. అలా శివ శంకర్ వర ప్రసాద్ కాస్తా.. చిరంజీవి అయ్యాడు. చరిత్ర సృష్టించారు. పవన్ కళ్యాణ్, చిరంజీవి టాలీవుడ్ ని శాసించే హీరోలుగా ఎదిగారు. పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఏపీ డిప్యూటీ సీఎం. ఆయన హరి హర వీరమల్లు, ఓజీ, ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రాల షూటింగ్స్ పూర్తి చేయాల్సి ఉంది. ఇటీవల హరి హర వీరమల్లు చిత్రీకరణలో పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. ఈ ప్రాజెక్ట్ నుండి క్రిష్ తప్పుకోగా, మరొక దర్శకుడు తెరపైకి వచ్చాడు. ఏఎం రత్నం ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 

ఇక దర్శకుడు సుజీత్ తెరకెక్కిస్తున్న ఓజీ పై భారీ అంచనాలు ఉన్నాయి. పీరియాడిక్ గ్యాంగ్స్టర్ డ్రామాగా ఓజీ తెరకెక్కుతుంది. డివివి దానయ్య నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ కి జంటగా ప్రియాంక అరుళ్ మోహన్ నటిస్తుంది. థమన్ సంగీతం అందిస్తున్నారు. ఈ ఏడాది ఓజీ, హరి హర వీరమల్లు థియేటర్స్ లోకి రానున్నాయి. ఉస్తాద్ భగత్ సింగ్ మూవీపై సందిగ్ధత కొనసాగుతుంది. ఇకపై పవన్ కళ్యాణ్ కొత్త సినిమాలకు సైన్ చేయకపోవచ్చు. డిప్యూటీ సీఎంగా ఆయన బిజీ అయ్యారు. పవన్ కళ్యాణ్ వారసుడిగా అకీరా ఎంట్రీ ఇచ్చే సూచనలు కలవు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Youtuber Nandu: యూట్యూబర్ నందు నెల సంపాదన ఎంతో తెలుసా? నందూస్ వరల్డ్ క్లోజ్ అవ్వబోతోందా?
Vijay Sangeetha Reunion: త్రిషకి సీఎం దళపతి బిగ్‌ షాక్‌.. మళ్లీ ఒక్కటైన విజయ్-సంగీత?