కలలు అందరికి ఒక మిస్టరీ. అవి ఎలా పడతాయి? వాటి రహస్యమేంటి? అనేది అందరికి మిస్టరీ. దాన్ని సినిమాగా చేస్తే, అదే `డ్రీమ్ క్యాచర్`.
సినిమా చాలా విస్తరించింది. టెక్నీకల్‌గానూ అప్ డేట్ అవుతుంది. హాలీవుడ్ లో తీసే టెక్నాలజీ మన వద్దకు వచ్చింది. ప్రపంచ స్థాయి టెక్నాలజీ మన అందుబాటులోఉంటుంది. దీంతో ఫిల్మ్ మేకర్స్ దాన్ని బాగా వాడుకుంటున్నారు. తెలుగు సినిమాలను ఫారెన్ మూవీస్ రేంజ్లో టెక్నీకల్‌గా తెరకెక్కిస్తున్నారు. కాన్సెప్ట్ లు కూడా అంతర్జాతీయ స్థాయిలో ఉంటున్నాయి. ఇప్పుడు వస్తున్న `డ్రీమ్ క్యాచర్` కూడా అలాంటి మూవీనే. సరికొత్త సైకలాజికల్ థ్రిల్లర్ గా దీన్ని తెరకెక్కిస్తున్నారు.
ఇందులో ప్రశాంత్ కృష్ణ, అనీషా ధామ, శ్రీనివాస్ రామిరెడ్డి, ఐశ్వర్య హోలక్కల్, తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. సీయెల్ మోషన్ పిక్చర్స్ బ్యానర్ పై దర్శకుడు సందీప్ కాకుల ‘డ్రీమ్ క్యాచర్’. ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ‘డ్రీమ్ క్యాచర్’ సినిమా జనవరి 3న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ నేపథ్యంలో శుక్రవారం టీమ్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ని నిర్వహించారు. ఈ రోజు ఈ సినిమా ప్రీ రిలీజ్ ప్రెస్ మీట్ ను హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు.
undefined
ఇందులో హీరో ప్రశాంత్ కృష్ణ మాట్లాడుతూ , నాలుగేళ్ల కిందట సందీప్ ‘డ్రీమ్ క్యాచర్’ సినిమా ఆడిషన్ కోసం పిలిచాడు. ఇప్పుడు ఈ వేదిక మీద మేమంతా ఉన్నామంటే కారణంగా మా సందీప్. సైకలాజికల్ థ్రిల్లర్ గా సరికొత్త ఎక్సిపీరియన్స్ ఈ సినిమా మీ అందరికీ ఇస్తుంది. ట్రైలర్ చూశాక నేను అడివిశేష్, రానా లా ఉన్నానంటూ కామెంట్స్ వస్తున్నాయి. వాళ్లు గొప్ప యాక్టర్స్, సెల్ఫ్ మేడ్ స్టార్స్. అలాంటి టాలెంటెడ్ ప్యాషనేట్ యాక్టర్స్ తో నన్ను పోల్చడం సంతోషంగా ఉంది. ‘డ్రీమ్ క్యాచర్’ మూవీ మిమ్మల్ని డెఫనెట్ గా ఆకట్టుకుంటుందన్నారు.
డైరెక్టర్ సందీప్ కాకుల మాట్లాడుతూ, సినిమా చేయాలనేది నా డ్రీమ్. కలల మీద సినిమా చేస్తే ఎలా ఉంటుందనే ఆలోచనతో ఈ ‘డ్రీమ్ క్యాచర్’ మూవీ మొదలైంది. `ఇన్ సెప్షన్` లాంటి హాలీవుడ్ మూవీస్ నాకు ఇన్సిపిరేషన్ గా నిలిచాయి. ఒక హాలీవుడ్ స్థాయి అటెంప్ట్ చేయాలని అనుకున్నాను. మనకున్న రిసోర్సెస్ లో మొత్తం హైదరాబాద్ లోనే సినిమా రూపొందించాను. కలల నేపథ్యంగా ఇలాంటి సినిమా ఇప్పటిదాకా తెలుగులో రాలేదని చెప్పగలను. గంటన్నర నిడివితో సినిమా ఉంటుంది. పాటలు ఫైట్స్ ఉండవు. అవి లేకుండా కేవలం కథ మీదనే మూవీ వెళ్తుంది. ఇది థియేటర్, ఓటీటీ కి వెళ్తుందా అని అనుకోలేదు. ఒక మంచి మూవీ చేస్తే ఎక్కడైనా ఆదరిస్తారని నమ్మాను. జనవరి 3న ‘డ్రీమ్ క్యాచర్’సినిమాను థియేటర్స్ లో చూసి సపోర్ట్ చేయాలని కోరుకున్నారు.