గతంలో టాలీవుడ్ లో స్టార్ హీరోలతో సినిమాలు నిర్మిచడానికి చాలా నిర్మాణ సంస్థలు పోటీ పడేవి. దిల్ రాజు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, అల్లు అరవింద్ గీతా ఆర్ట్స్ లాంటి నిర్మాణ సంస్థలో టాప్ ప్రొడక్షన్ హౌస్ లుగా కొనసాగేవి.
గతంలో టాలీవుడ్ లో స్టార్ హీరోలతో సినిమాలు నిర్మిచడానికి చాలా నిర్మాణ సంస్థలు పోటీ పడేవి. దిల్ రాజు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, అల్లు అరవింద్ గీతా ఆర్ట్స్ లాంటి నిర్మాణ సంస్థలో టాప్ ప్రొడక్షన్ హౌస్ లుగా కొనసాగేవి. కానీ గత కొన్నేళ్లుగా ఒక నిర్మణ సంస్థ టాలీవుడ్ ని ఆ మాటకొస్తే సౌత్ ఇండియా సినీ బిజినెస్ ని డామినేట్ చేస్తోంది.
ఆ నిర్మాణ సంస్థ మరేదో కాదు.. మైత్రి మూవీ మేకర్స్. నవీన్ యెర్నేని, రవిశంకర్, మోహన్ చెరుకూరి ఈ సంస్థకి అధినేతలుగా ఉన్నారు. గత కొన్నేళ్లలో మైత్రి మూవీస్ సంస్థ టాలీవుడ్ లో అగ్ర నిర్మాణ సంస్థగా ఎదిగింది. సినిమా ఫలితాలతో సంబంధం లేకుండా వీరు టాప్ హీరోలతో సినిమాలు చేస్తున్నారు. అదే విధంగా మీడియం రేంజ్ సినిమాలు కూడా చేస్తున్నారు.
ప్రస్తుతం ఈ ఒక్క నిర్మాణ సంస్థ చేతుల్లోనే కొన్ని వేలకోట్ల బిజినెస్ ఉంది. అదెలాగో ఇప్పుడు చూద్దాం. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, హను రాఘవపూడి కాంబినేషన్ లో మైత్రి మూవీస్ సంస్థ ఇటీవల చిత్రాన్ని ప్రారంభించింది. ఈ చిత్రానికి ఫౌజి అనే టైటిల్ వినిపిస్తోంది. బ్రిటిష్ నేపథ్యంలో జరిగే పీరియాడిక్ వార్ డ్రామా ఈ చిత్రం. దీనికోసం మైత్రి మూవీస్ వాళ్ళు 500 కోట్ల బడ్జెట్ కేటాయించారట.
అదే విధంగా పుష్ప 2 చిత్రాన్ని నిర్మిస్తోంది వీళ్ళే. ఈ చిత్రానికి 350 కోట్ల వరకు బడ్జెట్ అవుతోంది. డిసెంబర్ లో పుష్ప 2 రిలీజ్ అవుతున్న సంగతి తెలిసిందే. రీసెంట్ గా మైత్రి మూవీస్ సంస్థ మరో పాన్ ఇండియా చిత్రాన్ని లాంచ్ చేశారు. పాన్ ఇండియా డైరెక్టర్ ప్రశాంత్ నీల్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ కాంబినేషన్ లో ఒక చిత్రం లాంచ్ అయింది. ప్రశాంత్ నీల్ ఈ చిత్రాన్ని 400 కోట్ల బడ్జెట్ లో తెరకెక్కించబోతున్నట్లు టాక్.
అదే విధంగా పవన్ కళ్యాణ్ తో ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రం ఉంది. దీని బడ్జెట్ 150 కోట్లు. నితిన్ తో తమ్ముడు అనే చిత్రాన్ని 70 కోట్ల బడ్జెట్ లో నిర్మిస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో వస్తున్న మరో పాన్ ఇండియా చిత్రం రాంచరణ్ ఆర్సీ 16.
ఈ చిత్రాన్ని ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం ప్రీప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. త్వరలోనే షూటింగ్ మొదలు కానుంది. ఈ చిత్రానికి 350 నుంచి 400 కోట్ల బడ్జెట్ కేటాయిస్తున్నారట. అదే విధంగా అజిత్ తో తమిళ్ లో గుడ్ బాడ్ అగ్లీ అనే చిత్రం.. బాలీవుడ్ లో సన్నీడియోల్ లో ఒక చిత్రం మైత్రి మూవీస్ వాళ్లే నిర్మిస్తున్నారు. కాబట్టి ఈ ఒక్క నిర్మాణ సంస్థ చేతుల్లోనే కొన్ని వేల కోట్ల బిజినెస్ ఉంది.
బాలీవుడ్ లో ఈ తరహాలో యష్ రాజ్ ఫిలిమ్స్ సంస్థ సినిమాలు నిర్మిస్తూ ఉంటుంది. ఇప్పుడు వాళ్ళకి ధీటుగా మైత్రి మూవీ మేకర్స్ ఎదుగుతోంది. మైత్రి మూవీస్ సంస్థ ఖర్చుకు వెనుకాడకుండా ఇంత భారీగా సినిమాలు చేస్తున్నారు కాబట్టే స్టార్ హీరోలంతా ఈ బ్యానర్ లో నటించేందుకు ఆసక్తి చూపుతున్నారు.