నాగ చైతన్య-శోభిత పెళ్లి డేట్ ఫిక్స్? వేదిక ఎక్కడంటే?

By Sambi ReddyFirst Published Aug 21, 2024, 2:04 PM IST
Highlights

నాగ చైతన్య-శోభిత ధూళిపాళ్ల పెళ్ళికి ఏర్పాట్లు మొదలయ్యాయని సమాచారం. పెళ్లి ముహూర్తంతో పాటు వేదిక ఎక్కడనే చర్చలు జరుగుతున్నాయట. ఇంట్రెస్టింగ్ డిటైల్స్.. 
 

హీరో నాగ చైతన్య రెండో పెళ్లి చేసుకుంటున్న సంగతి తెలిసిందే. 2017లో సమంతను నాగ చైతన్య ప్రేమ వివాహం చేసకున్నాడు . మూడేళ్లకు పైగా అన్యోన్యంగా ఉన్న ఈ జంట 2021లో విడాకులు తీసుకున్నారు. సమంతకు దూరమైన నాగ చైతన్య తెలుగు అమ్మాయి శోభిత దూళిపాళ్లకు దగ్గరయ్యాడు. కొన్నాళ్లుగా వీరు డేటింగ్ చేస్తున్నారు. నాగ చైతన్య-శోభితల మధ్య ఎఫైర్ నడుస్తుంది అంటూ పలుమార్లు కథనాలు వెలువడ్డాయి. ఈ వార్తలను శోభిత ధూళిపాళ్ల ఖండించింది. 

సడన్ గా నిశ్చితార్థం జరుపుకుని ఆశ్చర్యానికి గురి చేశారు. ఆగస్టు 8వ తేదీన నాగార్జున నివాసంలో శోభిత-నాగ చైతన్యల నిశ్చితార్థం వేడుక నిరాడంబరంగా ముగిసింది. ఈ వేడుకకు కుటుంబ సభ్యులు మాత్రమే హాజరయ్యారు. సోషల్ మీడియా వేదికగా నాగార్జున కొడుకు నాగ చైతన్య నిశ్చితార్థం ఫోటోలు పంచుకున్నారు. కొత్త కోడలినిఅక్కినేని ఫ్యామిలీలోకి ఆహ్వానించాడు. నాగ చైతన్య-శోభిత కలకాలం ప్రేమానురాగాలతో సంతోషంగా జీవించాలని కాంక్షించారు. 

Latest Videos

మంచి ముహూర్తం కోల్పోకూడదనే నాగ చైతన్య ఎంగేజ్మెంట్ హడావుడిగా నిర్వహించినట్లు నాగార్జున వివరణ ఇచ్చారు. పెళ్ళికి కొంత సమయం ఉందని అన్నారు. తాజా సమాచారం ప్రకారం నాగ చైతన్య-శోభిత పెళ్ళికి ఏర్పాట్లు మొదలయ్యాయట. సెలెబ్రెటీల వివాహం అంటే సాధారణ విషయం కాదు. ప్రత్యేకంగా రూపొందించిన దుస్తులు, ఆభరణాలు సిద్ధం చేయాల్సి ఉంటుంది. ఈ క్రమంలో అక్కినేని ఇంట్లో పెళ్లి సందడి మొదలైంది అంటున్నారు. 

నాగ చైతన్య మరోమారు డెస్టినేషన్ వెడ్డింగ్ ప్లాన్ చేస్తున్నాడట. రాజస్థాన్, మధ్య ప్రదేశ్ రాష్ట్రాల్లో గల ఫేమస్ లొకేషన్స్ ని పరిశీలిస్తున్నారట. లేదంటే విదేశాల్లో వివాహ వేదిక ఏర్పాటు చేసే ఆలోచనలో ఉన్నారట. ఫిబ్రవరి లేదా మార్చి నెలలో ముహూర్తం ఫిక్స్ చేయనున్నారట. మరో ఆరు నెలల్లో నాగ చైతన్య పెళ్లి పీటలు ఎక్కడం ఖాయం అంటున్నారు. 

నాగ చైతన్య ప్రస్తుతం తండేల్ మూవీ చేస్తున్నారు. దర్శకుడు చందూ మొండేటి తెరకెక్కిస్తున్న తండేల్ ఎమోషనల్ లవ్ డ్రామా. సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తుంది. గీతా ఆర్ట్స్ బ్యానర్ లో అల్లు అరవింద్ నిర్మిస్తున్నాడు. దసరా కానుకగా అక్టోబర్ 11న తండేల్ మూవీ విడుదల కానుంది. 
 

click me!