
గత రెండేళ్లుగా ఓటిటి ప్లాట్ ఫార్మ్స్ విపరీతమై ప్రాచుర్యం పొందుతున్నాయి. పల్లె ప్రాంతాలకు కూడా ఓటీటీ సంస్థలు పాకాయి. స్టార్ హీరోల సినిమాలు కూడా నేరుగా ఓటిటి లో విడుదలవుతున్నాయి. వెంకటేష్, సూర్య, విక్రమ్ లాంటి హీరోలు థియేటర్స్ కంటే కూడా ఓటీటీ విడుదలకు మొగ్గుచూపుతున్నారు. అలాగే థియేటర్స్ లో విడుదలైన మూడు నాలుగు వారాల్లో డిజిటల్ స్ట్రీమింగ్ కి అందుబాటులో ఉంటున్నాయి సినిమాలు. కాగా పవన్ లేటెస్ట్ మూవీ భీమ్లా నాయక్ డిజిటల్, శాటిలైట్ రైట్స్ భారీ మొత్తానికి అమ్ముడుపోయాయని తెలుస్తుంది.
ప్రముఖ ఎంటర్టైన్మెంట్ సంస్థ స్టార్ ఇండియా భీమ్లా నాయక్ శాటిలైట్, డిజిటల్ రైట్స్(Bheemla Nayak digital rights) దక్కించుకుందట.దీంతో డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో భీమ్లా నాయక్ ప్రసారం కానుందట. ఫిబ్రవరి 25న భీమ్లా నాయక్ విడుదల అవుతుండగా నాలుగు వారాలు ముగిశాక భీమ్లా నాయక్ హాట్ స్టార్ లో ప్రదర్శిస్తారట. ఇక భీమ్లా నాయక్ మూవీకి ఉన్న డిమాండ్ రీత్యా... స్టార్ ఇండియా డిజిటల్, శాటిలైట్ రైట్స్ కి కలిపి రూ. 70 కోట్లకు వరకు చెల్లిందని సమాచారం.
ఇక విడుదలకు వారం రోజుల సమయం మాత్రమే ఉండగా భీమ్లా నాయక్(Bheemla Nayak) టికెట్స్ అడ్వాన్స్ బుకింగ్స్ మొదలయ్యాయి. సినిమాపై పాజిటివ్ బజ్ నడుస్తున్న నేపథ్యంలో రికార్డు ఓపెనింగ్స్ దక్కించుకునే ఆస్కారం కలదు. పవన్ క్లీన్ హిట్ అందుకొని చాలా కాలం అవుతుంది. ఆయన గత చిత్రం వకీల్ సాబ్ సైతం కొన్ని ఏరియాల్లో నష్టాలు మిగిల్చింది. భీమ్లా నాయక్ తో భారీ హిట్ నమోదు చేయాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. భీమ్లా నాయక్ ట్రైలర్ త్వరలో విడుదల కానుంది.
నేడు పూర్తిగా భీమ్లా నాయక్ షూటింగ్ పార్ట్ కంప్లీట్ అయ్యింది. ఈ మేరకు దర్శకుడు సాగర్ కే చంద్ర ట్వీట్ చేశారు. భీమ్లా నాయక్ షూట్ ముగించినట్లు వెల్లడించారు. పవన్ తో సెట్లో దిగిన ఫోటో ట్విట్టర్ లో షేర్ చేశారు. పోలీస్ గెటప్ లో పవన్ సూపర్ స్టైలిష్ గా ఉన్నారు. ఇక భీమ్లా నాయక్ రికార్డు స్థాయిలో విడుదల చేస్తున్నారు. ఓపెనింగ్ డే భీమ్లా నాయక్ కొత్త రికార్డు సెట్ చేస్తుందని టాలీవుడ్ వర్గాలు భావిస్తున్నాయి. ఇక హిందీలో కూడా విడుదల చేస్తుండగా.. అక్కడ ఫలితంపై ఉత్కంఠ నెలకొని ఉంది.
మలయాళ హిట్ మూవీ అయ్యప్పనుమ్ కోశియుమ్ అధికారిక రీమేక్ గా భీమ్లా నాయక్ తెరకెక్కింది. పవన్ కళ్యాణ్ పోలీస్ అధికారి రోల్ చేస్తున్నారు. అపవాన్ ప్రత్యర్థి ఆర్మీ అధికారి పాత్రను రానా చేస్తున్నారు. వీరిద్దరి మధ్య నడిచే ఆధిపత్య పోరే భీమ్లా నాయక్ చిత్రం. దర్శకుడు సాగర్ కె చంద్ర తెరకెక్కిస్తున్నారు. దర్శకుడు త్రివిక్రమ్ మాటలు, స్క్రీన్ ప్లే అందించారు. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో సూర్యదేవర నాగవంశీ నిర్మించారు. నిత్యా మీనన్ పవన్ కి జంటగా నటిస్తుండగా... థమన్ సంగీతం అందిస్తున్నారు.