ఓ పక్క దేవదాస్, మరోపక్క బిగ్ బాస్.. ఈ ఒత్తిడితో ఏ కాశీకో వెళ్లిపోతాను.. నాని కామెంట్స్!

Published : Sep 25, 2018, 04:28 PM IST
ఓ పక్క దేవదాస్, మరోపక్క బిగ్ బాస్.. ఈ ఒత్తిడితో ఏ కాశీకో వెళ్లిపోతాను.. నాని కామెంట్స్!

సారాంశం

నా జీవితంలో హెక్టిక్ వీకెండ్ ఇది.. చాలా ఒత్తిడికి గురవుతున్నా.. అలానే చాలా ఎగ్జైటింగ్ గా ఉంది.. ఈ వారం అయిపోతే కొన్ని రోజులు ఏ కాశీకో వెళ్లిపోతాను అంటున్నాడు నటుడు నాని. 

నా జీవితంలో హెక్టిక్ వీకెండ్ ఇది.. చాలా ఒత్తిడికి గురవుతున్నా.. అలానే చాలా ఎగ్జైటింగ్ గా ఉంది.. ఈ వారం అయిపోతే కొన్ని రోజులు ఏ కాశీకో వెళ్లిపోతాను అంటున్నాడు నటుడు నాని. అతడు నటించిన 'దేవదాస్' సినిమా గురువారం ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో నాని ఇలాంటి వ్యాఖ్యలు చేశారు. 'దేవదాస్' సినిమా విడుదలైన తరువాతి రోజే బిగ్ బాస్ షో గ్రాండ్ ఫినాలే మొదలవుతుంది. ఈ ఒత్తిడి నుండి బయట పడాలంటే కచ్చితంగా ఎటైనా వెళ్లాలి..

అందుకే బిగ్ బాస్ షో పూర్తయిన వెంటనే కాశీకో, మరెక్కడికైనా వెళ్లాలనుకుంటున్నట్లు నాని వెల్లడించారు. నిజానికి నాని ఒకేసారి రెండు, మూడు సినిమాల్లో నటిస్తుంటాడు. కానీ ఎప్పుడూ కూడా అతడు ఒత్తిడికి గురవుతున్నట్లు కనిపించలేదు. కానీ ఈసారి అంతగా స్ట్రెస్ తీసుకోవడానికి కారణం బిగ్ బాస్ షో అనే చెప్పాలి. అందుకే ఆయన ఇటువంటి వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది.   
 

PREV
click me!

Recommended Stories

Suman Shetty Eliminate: సుమన్‌ శెట్టి ఎలిమినేట్‌.. భరణితో స్నేహం దెబ్బ కొట్టిందా? తనూజ ఆవేదన
Ustaad Bhagat Singh: ఊపేసేలా ఉన్న `దేఖ్‌ లేంగే సాలా` పాట.. మళ్లీ ఆ రోజులను గుర్తు చేసిన పవన్‌ కళ్యాణ్‌