RRR Movie:ఆర్ ఆర్ ఆర్ మూవీపై కెజిఎఫ్ డైరెక్టర్ షాకింగ్ ట్వీట్... ఎన్టీఆర్, చరణ్, రాజమౌళిని ఉద్దేశిస్తూ.. 

Published : Mar 25, 2022, 06:23 PM IST
RRR Movie:ఆర్ ఆర్ ఆర్ మూవీపై కెజిఎఫ్ డైరెక్టర్ షాకింగ్ ట్వీట్... ఎన్టీఆర్, చరణ్, రాజమౌళిని ఉద్దేశిస్తూ.. 

సారాంశం

ఆర్ ఆర్ ఆర్ మూవీ సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. మూవీ విడుదల నేపథ్యంలో టాప్ లో ట్రెండ్ అవుతుంది. సామాన్యుల నుండి సెలెబ్రెటీల వరకు ఆర్ ఆర్ ఆర్ మూవీపై తమ రివ్యూ ఇస్తున్నారు. ఈ క్రమంలో కెజిఎఫ్ డైరెక్టర్ స్పందించారు.

గత వారం రోజులుగా దేశం ఆర్ ఆర్ ఆర్ (RRR Movie) జపం చేస్తుంది. నేడు ఈ భారీ యాక్షన్ ఎంటర్టైనర్ థియేటర్స్ లో దిగింది. సినిమా చూసిన సగటు ప్రేక్షకులు తమ అనుభూతి సోషల్ మీడియాలో పంచుకుంటున్నారు. అలాగే చిత్ర పరిశ్రమ ప్రముఖులు సైతం ఆర్ ఆర్ ఆర్ మూవీపై  తమ రివ్యూ ఇస్తున్నారు. ఈ లిస్ట్ లో కెజిఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కూడా చేరారు. ఆయన ఆర్ ఆర్ ఆర్ మూవీని, దర్శకుడు రాజమౌళి(Rajamouli), హీరోలు ఎన్టీఆర్, రామ్ చరణ్ లను ఉద్దేశిస్తూ ట్వీట్ చేశారు. ప్రశాంత్ నీల్ తన ట్వీట్ లో ఆర్ ఆర్ ఆర్ మూవీ అద్భుతమన్న అభిప్రాయం వెల్లడించారు. 

ఆర్ ఆర్ ఆర్ మూవీ సక్సెస్ నేపథ్యంలో టీమ్ సభ్యులకు అభినందనలు. ఎన్టీఆర్, రామ్ చరణ్(Ram Charan) ల నటన సెన్సేషన్.. ఇక రాజమౌళి సర్ దర్శకత్వం గురించి ఎంత చెప్పినా తక్కువే... అంటూ ప్రశాంత్ నీల్ తన ఫీలింగ్ పంచుకుంటున్నారు. కెజిఎఫ్ మూవీ ఇండియా వైడ్ పాపులారిటీ తెచ్చుకున్న ప్రశాంత్ నీల్ ఆర్ ఆర్ ఆర్ ని పొగుడుతూ ట్వీట్ చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. అదే సమయంలో ప్రశాంత్ నీల్ కి ఆర్ ఆర్ ఆర్ టీమ్ కృతజ్ఞతలు తెలిపారు. 

మరో మూడు వారాల్లో కెజిఎఫ్ 2 విడుదల కానుంది. ఏప్రిల్ 14న మూవీ విడుదల కాగా... మార్చి 27న ట్రైలర్ విడుదల చేస్తున్నారు. కెజిఎఫ్ ఫస్ట్ పార్ట్ కి కొనసాగింపుగా వస్తున్న ఈ మూవీపై భారీ అంచనాలున్నాయి. మరోవైపు ప్రభాస్ తో ప్రశాంత్ నీల్ (Prashanth Neel)సలార్ మూవీ తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. కెజిఎఫ్ నిర్మాతలే నిర్మిస్తున్న ఈ మూవీ కొంతభాగం షూటింగ్ జరుపుకుంది. వచ్చే ఏడాది సమ్మర్ లో సలార్ విడుదల కానుంది. 

సలార్ తర్వాత ఆయన ఎన్టీఆర్(NTR) చిత్రాన్ని డైరెక్ట్ చేయనున్నారు. ఇప్పటికే ఎన్టీఆర్-ప్రశాంత్ నీల్ ప్రాజెక్ట్ పై ప్రకటన జరిగింది. ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఈ క్రేజీ ప్రాజెక్ట్ కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ప్రభాస్ మూవీ కంటే ముందే ఎన్టీఆర్ మూవీ ప్రకటించినప్పటికీ.. కొన్ని కారణాల వలన ఆ ప్రాజెక్ట్ డిలే అయ్యింది. 
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Harikrishna: ఆ శక్తి ఉంటే తప్పకుండా నందమూరి హరికృష్ణని బతికిస్తా.. ఎలాగో చెబుతూ కీరవాణి ఎమోషనల్ కామెంట్స్
Avatar 3 Review: అవతార్‌ 3 మూవీ రివ్యూ, రేటింగ్‌.. జేమ్స్ కామెరూన్‌ ఇక ఇది ఆపేయడం బెటర్‌