
దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ చిత్రం ప్రస్తుతం థియేటర్స్ లో సందడి చేస్తోంది. ప్రీమియర్ షోల నుంచే ఈ చిత్రానికి బ్లాక్ బస్టర్ టాక్ మొదలయింది. ఎన్టీఆర్, రాంచరణ్ అభిమానుల కేరింతలతో థియేటర్స్ మోతెక్కుతున్నాయి. రాంచరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో, ఎన్టీఆర్ కొమరం భీం పాత్రలో అద్భుతమైన నటన అందించారు.
దేశం నలువైపుల నుంచి రాజమౌళి, ఎన్టీఆర్, రాంచరణ్ పై ప్రశంసల జల్లులు కురుస్తున్నాయి. అద్భుతమైన యాక్షన్ ఎపిసోడ్స్ తో సినిమా సరికొత్త అనుభూతి ఇస్తోంది అంటూ ప్రేక్షకులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అలాగే సెలెబ్రిటీలు కూడా ఆర్ఆర్ఆర్ చిత్రానికి ఫిదా అవుతున్నారు.
తాజాగా ఆర్ఆర్ఆర్ చిత్రం వీక్షించిన మెగాస్టార్ చిరంజీవి తన స్పందనని సోషల్ మీడియాలో పంచుకున్నారు. 'మాస్టర్ స్టోరీ టెల్లర్ రాజమౌళి నుంచి వచ్చిన మరో మాస్టర్ పీస్ ఆర్ఆర్ఆర్ చిత్రం. రాజమౌళి సినిమాటిక్ విజన్ మైండ్ బ్లోయింగ్ అనిపిస్తుంది. ఆర్ఆర్ఆర్ చిత్ర యూనిట్ మొత్తానికి హ్యాట్సాఫ్' అంటూ ప్రశంసలు కురిపించారు.
ఆర్ఆర్ఆర్ చిత్రం వీక్షించిన టాలీవుడ్ దర్శకులు నటులు సోషల్ మీడియా వేదికగా తమ అనుభూతి పంచుకుంటున్నారు. నేడు ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాగా ఈ తెల్లవారు జామునే ఎన్టీఆర్.. రాంచరణ్ వేరు వేరుగా తమ కుటుంబాలతో ఆర్ఆర్ఆర్ చిత్రాన్ని వీక్షించారు.
టాలీవుడ్ సెలెబ్రెటీల కోసం ప్రత్యేక ప్రీమియర్ షో ప్రదర్శించినట్లు తెలుస్తోంది. అలాగే ముంబైలో కూడా మీడియా కోసం స్పెషల్ స్క్రీనింగ్ వేశారు. హీరోల ఇంట్రడక్షన్ సన్నివేశాలు, ఇంటర్వెల్, క్లయిమాక్స్, నాటు నాటు సాంగ్, కొమరం భీముడో సాంగ్ ఇలా ఫ్యాన్స్ ఎంజాయ్ చేసే ఎలిమెంట్స్ సినిమాలో చాలా ఉన్నాయి.