
సినిమా షూటింగ్ సమయాల్లో నటీనటులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా వారికి కావాల్సిన వసతులన్నీ ఏర్పాటు చేస్తుంటారు చిత్రనిర్మాతలు. ఇక స్టార్ హీరోయిన్లంటే వాళ్ల డిమాండ్ కాస్త ఎక్కువే.. టిఫిన్ నుండి రాత్రి పడుకునే మంచం వరకు ప్రతి విషయంలో నాణ్యత కోరుకుంటారు.
ఇప్పుడంటే సినిమా ప్రొడక్షన్ కాస్ట్ పెరిగింది కాబట్టి అందరికీ స్టార్ హోటల్స్ బుక్ చేస్తున్నారు. కానీ ఒకప్పటి హీరోయిన్లు మాత్రం బాగానే అడ్జస్ట్ అయ్యేవారు. కానీ నటి శ్రీవిద్య మాత్రం స్నానం చేయడానికి కూడా బిస్లరీ వాటర్ తీసుకురమ్మని చెప్పేవారట.
తమిళ, తెలుగు చిత్రాల్లో నటించి మెప్పించిన ఆమె ఓ తెలుగు సినిమా షూటింగ్ కోసం రాజమండ్రి వెళ్లాల్సి వచ్చిందట. అక్కడ ఓ గ్రామంలో ఉండడానికి ఏర్పాట్లు చేశారు. అన్నీ బాగానే ఉన్నా.. స్నానాలు మాత్రం గోదావరి నీళ్లతో చేయాల్సి వచ్చిందట. వరదల కారణంగా నీళ్లు బురదగా ఉండడంతో బురద నీరు కిందకు పోయి..
స్వచ్చమైన నీరు పైకి వచ్చేలా టెక్నిక్స్ ఉపయోగొంచేవారట.
ఆ నీటిని స్నానం కోసం నటీనటులకు అందిచేవారు. అయితే శ్రీవిద్య మాత్రం తను ఆ నీటితో స్నానం చేయనని.. తన శరీర సౌందర్యం, ఆరోగ్యం దెబ్బ తింటాయని గొడవ చేసేవారట. దాంతో అందరికీ తాగడానికి తెప్పించే బిస్లరీ వాటర్ ని బకెట్లలో పోసి ఇవ్వమన్నారట. అప్పుడే మార్కెట్ లోకి వచ్చి బిస్లరీ వాటర్ లీటర్ సీసా ఆరు రూపాయలు. రెండు బకెట్లు నిండే వరకుబిస్లరీ వాటర్ పోసి శ్రీవిద్య స్నానానికి అందించేవారట.