నాగ్ డైరక్టర్ తో తిరువీర్ ..స్పై థ్రిల్లర్

Published : Jul 23, 2023, 03:07 PM IST
 నాగ్ డైరక్టర్ తో  తిరువీర్ ..స్పై థ్రిల్లర్

సారాంశం

 ‘మిషన్ తషాఫి’లో తిరువీర్ ఓ కీల‌క పాత్ర‌లో న‌టిస్తున్నారు.  ఎంగేజింగ్‌, థ్రిల్లింగ్ యాక్ష‌న్ స‌న్నివేశాల‌తో సినిమాల‌ను తెర‌కెక్కిస్తూ త‌న‌దైన గుర్తింపు సంపాదించుకున్న ద‌ర్శ‌కుడు ప్ర‌వీణ్ స‌త్తారు


 నటుడు తిరువీర్.. వరుస ఎంటర్టైనర్ సినిమాలతో ఆడియన్స్ ముందుకు వచ్చి మంచి గుర్తింపుని సంపాదించుకుంటున్నాడు. ఇటీవల హీరోగా మసూద (Masooda) వంటి హారర్ మూవీతో వచ్చి బ్లాక్ బస్టర్ ని అందుకున్నాడు. తాజాగా ‘పరేషాన్’ సినిమాతో వచ్చి మరో సక్సెస్ ని అందుకున్నాడు. ప్రస్తుతం ఆయన స్పై థ్రిల్లర్ కమిటయ్యారు. అయితే అది సినిమా కాదు వెబ్ సీరిస్. ఈ సీరిస్ ని యాక్షన్ సినిమాలతో పేరు తెచ్చుకున్న డైరక్టర్ ...దర్శకత్వం వహిస్తున్నారు. వివరాల్లోకి వెళితే...

  జీ5 ఓటిటి సంస్ద ఎంతో ప్రెస్టీజియ‌స్‌గా రూపొందిస్తోన్న వెబ్ సిరీస్ ‘మిషన్ తషాఫి’లో తిరువీర్ ఓ కీల‌క పాత్ర‌లో న‌టిస్తున్నారు.  ఎంగేజింగ్‌, థ్రిల్లింగ్ యాక్ష‌న్ స‌న్నివేశాల‌తో సినిమాల‌ను తెర‌కెక్కిస్తూ త‌న‌దైన గుర్తింపు సంపాదించుకున్న ద‌ర్శ‌కుడు ప్ర‌వీణ్ స‌త్తారు ఈ వెబ్ సిరీస్‌ను డైరెక్ట్ చేస్తున్నారు. ప్ర‌ణ‌తి రెడ్డి నిర్మాత‌. ఇప్ప‌టికే రెగ్యుల‌ర్ షూటింగ్ అనుకున్న ప్లానింగ్ ప్ర‌కారం శ‌ర‌వేగంగా పూర్తవుతుంది.  PSV గరుడవేగ ఫేం ప్రవీణ్ సత్తారు ఇంతకు ముందు నాగార్జున తో ఘోస్ట్ చిత్రం రూపొందించిన సంగతి గుర్తుండే ఉండి ఉంటుంది.

ఇండియా లో భారీ విధ్వంసాన్ని  సృష్టించడానికి ప్రయత్నిస్తున్న ఒక విదేశీ తీవ్రవాద సంస్థకి, ఇండియన్ RAW ఏజెంట్స్  కి మధ్య నడిచే బావోద్వేగమైన  హై ఇన్‌టెన్స్ యాక్ష‌న్ స్పై థ్రిల్ల‌ర్ ఇది.  8 ఎపిసోడ్స్ ఉన్న ‘మిషన్ తషాఫి’ వెబ్ సిరీస్‌ను  ఫిల్మ్ రిప‌బ్లిక్ బ్యాన‌ర్‌పై ప్ర‌ణ‌తి రెడ్డి నిర్మిస్తున్నారు.  ఇప్ప‌టి వ‌ర‌కు ఓ తెలుగు వెబ్ సిరీస్‌ను ఫారిన్ లొకేష‌న్స్‌లో చిత్రీక‌రించ‌లేదు. కానీ తొలిసారి ‘మిషన్ తషాఫి’ సిరీస్‌ను విదేశాల్లో కూడా చిత్రీక‌రిస్తున్నారు. అలాగే ఇంట‌ర్నేష‌న‌ల్ యాక్ష‌న్ కొరియోగ్రాఫ‌ర్స్ నేతృత్వంలో ఫైట్స్‌ను చిత్రీక‌రిస్తున్నారు డైరెక్ట‌ర్ ప్ర‌వీణ్ స‌త్తారు.

ఇప్పుడు వెర్స‌టైల్ యాక్ట‌ర్ తిరువీర్ ఈ టీమ్‌లో జాయిన్ కావ‌టంపై మేక‌ర్స్ చాలా హ్యాపీగా ఉన్నారు. తిరువీర్ బ‌ర్త్ డే సంద‌ర్బంగా ‘మిషన్ తషాఫి’లో ఆయ‌న న‌టిస్తున్నారంటూ జీ 5 అధికారికంగా ప్ర‌క‌టించింది.  తిరువీర్ విల‌క్ష‌ణ న‌ట‌న‌తో త‌న పాత్ర‌ను డైరెక్ట‌ర్ ఊహించిన దాని కంటే ఇంకా బెట‌ర్ ఔట్ పుట్ ఇస్తార‌ని మేక‌ర్స్‌ భావిస్తున్నారు. ప్ర‌వీణ్ స‌త్తారు వంటి డైరెక్ట‌ర్‌తో క‌లిసి ప‌ని చేయ‌టంపై తిరువీర్ సైతం ఎంతో ఆస‌క్తిగా ఉన్నారు.

PREV
click me!

Recommended Stories

Karthika Deepam 2 Latest Episode:అత్తను ఒప్పించిన దీప-సారీ చెప్పిన శౌర్య-కావేరికి దొరికిపోయిన శ్రీధర్
OTT లో ఈ వారం రిలీజ్ అయ్యే సినిమాలు వెబ్ సిరీసులు, సస్పెన్స్,థ్రిల్లర్స్ ఇష్టపడే వారికి పండగే..