న్యూ ఇయర్ స్పెషల్ గా ‘వీరసింహారెడ్డి’ థర్డ్ సింగిల్.. పోస్టర్ అదిరిపోయిందిగా!

Published : Dec 21, 2022, 12:10 PM IST
న్యూ ఇయర్ స్పెషల్ గా ‘వీరసింహారెడ్డి’ థర్డ్ సింగిల్.. పోస్టర్ అదిరిపోయిందిగా!

సారాంశం

నందమూరి బాలకృష్ణ ‘వీరసింహారెడ్డి’ నుంచి మూడో పాట కూడా రాబోతోంది. తాజాగా థర్డ్ సింగిల్ రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేశారు. అప్డేట్ తో పాటు దుమ్ములేచిపోయే పోస్టర్ ను కూడా వదలడంతో నెట్టింట వైరల్ గా మారింది.  

సంక్రాంతి  కానుకగా  సీనియర్ హీరో నందమూరి నటసింహాం బాలకృష్ణ (Balakrishna) నటించిన ‘వీరసింహారెడ్డి’ (Veera Simha Reddy) విడుదల కాబోతోంది.  గోపీచంద్ర మాలినేని దర్శకత్వం వహించగా.. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై చాలా గ్రాండ్ గా చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం  రిలీజ్ ఏర్పాట్లలో యూనిట్ ఫుల్ బిజీగా ఉంది. ఈ సందర్భంగా సినిమా ప్రచార కార్యక్రమాలను కొనసాగిస్తూ బ్యాక్ టు బ్యాక్ అప్డేట్స్ అందిస్తున్నారు. 

చిత్రం నుంచి వచ్చిన పోస్టర్లు, గ్లింప్స్, టీజర్ కు దుమ్ములేచిపోయింది. మరోవైపు సాంగ్స్ లోనూ అంచనాలను మించిపోతోంది. ఇప్పటికే  సినిమా నుంచి రెండు హిట్ సాంగ్స్ విడుదలైన  యూట్యూబ్ ను షేక్ చేస్తున్నాయి. ‘జై బాలయ్య’, ‘సుగుణ సుందరి’ పాటలు ట్రెండింగ్ లో ఉన్నాయి. ఈలోగా మరో మాస్ అప్డేట్ అందించారు మేకర్స్. ‘వీరసింహారెడ్డి’ మూడో సాంగ్ ను కూడా రిలీజ్ సిద్ధం చేసినట్టు తెలిపారు. ఈ సందర్భంగా అఫిషీయల్ రిలీజ్  డేట్ ను అనౌన్స్ చేశారు.

థర్డ్ సింగిల్ ను ‘మా బావ మానోభావాలు’(Maa Bava Manobhavalu) అనే క్రేజీ టైటిల్ తో విడుదల చేయబోతున్నారు. డిసెంబర్ 24న మధ్యాహ్నం 3.19 నిమిషాలకు విడుదల చేయనున్నామని తెలిపారు. న్యూ ఇయర్ స్పెషల్ గా ఈసాంగ్ ను రిలీజ్ చేస్తున్నారంట. దీంతో సెలబ్రేషన్స్ లో బాక్సులు బద్దలైపోతాయని సాంగ్ పై అంచనాలు పెంచేశారు. మరోవైపు అప్డేట్ ఇచ్చిన కొద్ది సేపటికే సాంగ్ టైటిల్ ట్రెండింగ్ లోకి వచ్చింది. 

అప్డేట్ అందిస్తూ విడుదల చేసిన పోస్టర్ కూడా ఆకట్టుకుంటోంది. బాలయ్య మాస్ స్టిల్ కు ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. పోస్టర్ డిజైనింగ్ సాంగ్ పై ఆసక్తిని పెంచుతోంది.  
బాలయ్య సరసన గ్లామర్ బ్యూటీ శ్రుతి హాసన్ (Shruti Haasan) నటిస్తోంది. సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నారు. జవనరి 12న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Bigg Boss 10 Krishnudu: హీరో కాబోయి వినాయకుడు అయ్యాడు.. యాక్సిడెంట్‌ లైఫ్‌ రివర్స్.. కృష్ణుడు ఎమోషనల్‌ జర్నీ
Bigg Boss Telugu 10: అవమానించిన బిందు మాధవి చేతుల మీదగానే ఎంట్రీ ఇచ్చిన రోహిత్ శెట్టి..!