'అరవింద సమేత'లో మూడో హీరోయిన్!

Published : Sep 29, 2018, 12:32 PM IST
'అరవింద సమేత'లో మూడో హీరోయిన్!

సారాంశం

ఎన్టీఆర్, త్రివిక్రమ్ కాంబినేషన్ లో రూపొందుతోన్న 'అరవింద సమేత' సినిమా మరికొద్ది రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇటీవలే సినిమా షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాల్లో బిజీగా గడుపుతోంది. 

ఈ సినిమాలో పూజా హెగ్డే, ఈషా రెబ్బ హీరోయిన్లుగా కనిపించనున్నారు. అయితే వీరిద్దరితో పాటు సినిమాలో మరో హీరోయిన్ కూడా కనిపించనుందని సమాచారం. తెలుగులో రెండు, మూడు చిన్న చిత్రాల్లో నటించిన కన్నడ బ్యూటీ మేఘశ్రీ కి ఈ సినిమాలో నటించే ఛాన్స్ వచ్చిందని తెలుస్తోంది.

టాలీవుడ్ లో ఎలాంటి గుర్తింపు లేని మేఘశ్రీకి త్రివిక్రమ్ అవకాశం ఇవ్వడం ఆశ్చర్యం కలిగిస్తోంది. సినిమాలో ఆమె పాత్ర ఎలా ఉండబోతుందనే విషయంపై స్పష్టత రాలేదు. ఎన్టీఆర్ తో మాత్రం ఆమె కాంబినేషన్ సీన్లు ఉంటాయని సినిమాకి గ్లామర్ పార్ట్ జోడించడానికి ఆమెని ఎంపిక చేసినట్లు చెబుతున్నారు. మరి ఈ సినిమాతోనైనా మేఘకి మంచి గుర్తింపు లభిస్తుందేమో చూడాలి!

PREV
click me!

Recommended Stories

Hero Karthik: ఆ అలవాటు వల్ల కెరీర్ లో పతనం.. అన్వేషణ హీరో కార్తీక్ ఆరోగ్యం ఆరోగ్య పరిస్థితి ఏంటి ?
55 ఏళ్ల వయసులో 300 సినిమాలు, 200 కోట్లకు పైగా ఆస్తి, స్టార్ డైరెక్టర్ ను పెళ్లాడిన హీరోయిన్ ఎవరు?